VG Siddhartha: కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్ధ బయోపిక్.. ఆ పుస్తకం ఆధారంగా..

VG Siddhartha: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు దివంగత వీజీ సిద్ధార్థ అసాధారణమైన జీవితాన్ని గడిపారు. అతడి జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్లు పబ్లిషింగ్ హౌస్ పాన్ మాక్‌మిలన్ ఇండియా గతంలో ప్రకటించింది.
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు దివంగత వీజీ సిద్ధార్థ అసాధారణమైన జీవితాన్ని గడిపారు. దివంగత వీజీ సిద్ధార్థ జీవిత చరిత్రను విడుదల చేయనున్నట్టు పబ్లిషింగ్ హౌస్ పాన్ మాక్‌మిలన్ ఇండియా గతంలో ప్రకటించింది.
కాఫీ కింగ్: ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడెన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ పేరుతో ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది. ఈ పుస్తకం అతని "వ్యాపారవేత్తగా అతడి ఎదుగుదల, అతని పతనం, అతని ఆర్థిక సంక్షోభాలు చివరికి అతని దిగ్భ్రాంతికరమైన మరణానికి దారితీసిన కారణాలను వివరిస్తుంది.
కాఫీ కింగ్: ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడెన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ VG సిద్ధార్థ అనే పుస్తకాన్ని పరిశోధనాత్మక పాత్రికేయులు రుక్మిణి BR మరియు ప్రోసెన్‌జిత్ దత్తా రాశారు. ఇప్పుడు ఆ పుస్తకంలోని సమాచారం ఆధారంగా సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పుస్తకం హక్కులను టీ-సిరీస్ సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ శుక్రవారం వెల్లడించారు.
"BIOPIC OF CAFE COFFEE DAY FOUNDER ప్రకటించారు... #TSeries [#BhushanKumar], #AlmightyMotionPicture మరియు #KarmaMediaEntertainment వ్యవస్థాపకుడు #VGSiddhartha జీవిత చరిత్రపై AV హక్కులను పొందాయి..." అని తరణ్ ఆదర్శ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆల్‌మైటీ మోషన్ పిక్చర్ నిర్మాత ప్రబ్లీన్ కౌర్ సంధు మాట్లాడుతూ, "భారతదేశానికి అత్యంత ఇష్టమైన బ్రాండ్‌లలో కేఫ్ కాఫీ డే ఒకటి. మేము సిద్ధార్థ కథలోని అన్ని సూక్ష్మ నైపుణ్యాలను తెరపైకి తీసుకువస్తాము. ఇది లోతుగా పరిశోధించి రాసిన పుస్తకం. ఇది ఈ గొప్ప వ్యవస్థాపకుడి జీవితంలోని తెలియని కోణాలను బయటకు తీసుకురావడానికి మాకు చాలా స్కోప్ ఇస్తుంది.
పుస్తక సహ రచయిత రుక్మిణి బి.ఆర్ మాట్లాడుతూ "సిద్ధార్థ కథ జీవితంలోని ప్రతి దశలోనూ ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతుంది. దీనిని సినిమాగా తీసుకురావాలన్న ఆలోచన మాకు చాలా సంతృప్తిని ఇస్తుందని అన్నారు.
పుస్తకం యొక్క సహ-రచయిత, ప్రోసెన్‌జిత్ దత్తా మాట్లాడుతూ.. "సిద్ధార్థ ఓ మంచి వ్యాపారవేత్త. అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తి. మేము ఈ వైరుధ్యాన్ని పుస్తకంలోనూ, తెరపైనా చూపించాలనుకుంటున్నాం. నిర్మాత శైలేష్ ఆర్ సింగ్, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మాట్లాడుతూ, "ఇది నా కెరీర్‌లో ఓ బెస్ట్ ప్రాజెక్ట్" అవుతుంది అని ముగించారు.
దేశంలో అతిపెద్ద కాఫీ రిటైల్ చైన్ CCDని సహ-స్థాపించిన సిద్ధార్థ జూలై 31, 2019న ఆత్మహత్య చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com