Ravi Teja : భక్తిబాట పట్టిన బర్త్ డే బాయ్ రవితేజ

Ravi Teja :  భక్తిబాట పట్టిన బర్త్ డే బాయ్ రవితేజ
X

మాస్ మహరాజ్ రవితేజ నుంచి వరుసగా మూవీస్ వస్తున్నాయి. రిజల్ట్ తో పనిలేకుండా అతను సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఫైనల్ గా తన ఇమేజ్ ను దాటి భర్తలకు మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీతో సంక్రాంతి మరిలో సత్తా చాటాడు. ఈ మూవీతో విజయాన్ని అందుకున్నాడు. దీంతో పాటు అతను గతంలోనే మొదలు పెట్టిన మరో మూవీ ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మూవీ మొదలైంది. ఈ కాంబినేషన్ పై కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకున్నారు. ఇక తాజాగా ఈ మూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఇవాళ మాస్ రాజా బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ టైటిల్ ను ప్రకటించారు. రవితేజ బర్త్ డేను ఈ టైటిల్ తోనే సెలబ్రేట్ చేశారు అని చెప్పాలి.

‘ఇరుముడి’అనే టైటిల్ తో రాబోతోంది ఈ మూవీ. రవితేజ లాంటి హీరో నుంచి ఈ టైప్ లో టైటిల్ ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. అతని ఇమేజ్ కు అసలు సంబంధం లేని టైటిల్ ఇది. ఇక శివ నిర్వాణ నుంచి కూడా ఈ తరహా సినిమాను ఊహించలేదు. అసలు ఇరుముడి అనే టైటిల్ నే ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఈ కాంబినేషన్ లో డిఫరెంట్ మూవీ వస్తుందని మాత్రం చెప్పారు. మరి ఈ తరహా వైవిధ్యమైన సినిమా అనేది ఊహించలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఈ సమ్మర్ లోనే సినిమా విడుదల కాబతోంది. ఈ మేరకు రవితేజ నుంచి ప్లానింగ్ కూడా ఉందని టాక్. ఈ రేంజ్ లో చాలా వేగంగా సినిమాలు నిర్మించడం మాత్రం మాస్ రాజాకే సాధ్యం అవుతుంది. మొత్తంగా ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది చెప్పలేదు. కానీ ఇరుముడి అనే టైటిల్ కు తగ్గట్టుగా రవితేజ ఆ గెటప్ తోనే ఉన్నాడు. తనతో పాటు ఓ పాప కూడా కనిపిస్తుంది. మరి ఈ మూవీతో ఎలాంటి కంటెంట్ అందివ్వబోతున్నారు అనేది మాత్రం చూడాలి.

Tags

Next Story