Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిజంగానే పవర్ లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎమ్ గా తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. అయితే ఎన్నికలకు ముందు నుంచే సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అప్పటికే సగం పూర్తయిన ఓ.జి, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు సినిమాలు అలాగే ఆగిపోయాయి. వీటిలో హరిహర అప్పటికి చాలాముందుగానే ఆగిపోయింది. ఇక ఒక షెడ్యూల్ అయితే అయిపోతుందనుకున్న ఓ.జి ఆగడం అభిమానులను డిజప్పాయింట్ చేసింది. సాహో తర్వాత సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ తోనే ఫ్యాన్స్ కు ఓ హై ఎండ్ కిక్ వచ్చింది. ఆ కిక్ ను థియేటర్స్ లో ఫీలవ్వాలనుకున్నారు. బట్ లేట్ అయింది. ఇటు ఉస్తాద్ పరిస్థితి మరీ అంత లేదు కానీ.. ఈ మూవీ గబ్బర్ సింగ్ కాంబోలో వస్తోంది కాబట్టి కొంత క్రేజ్ ఉంది. బట్ మిస్టర్ బచ్చన్ చూసిన తర్వాత ఉస్తాద్ రాకపోయినా ఫర్వాలేదు అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోయారు ఫ్యాన్స్. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే.
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓజి నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు అని టాక్. ఈ పాట పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను ఎలివేట్ చేసేలా ఉంటుందట. అంటే సినిమాలో క్యారెక్టరైజేషన్ గురించి ఉంటుందని చెబుతున్నారు. ఓజిలో పవన్ అండర్ వరల్డ్ మాఫియా డాన్ లా కనిపించబోతున్నాడు. అలాంటి పాత్ర అంటే పాట కూడా ఇంకా పవర్ ఫుల్ గానే ఉంటుంది. ఈ పాట తర్వాత పవన్ ఓజిని పూర్తి చేయాలనే డిమాండ్స్ కూడా పెరుగుతాయట. అలా ఉంటుందంటున్నారు. కొన్ని ఇప్పుడు వినడానికి బానే ఉంటాయి. పాట వస్తే కానీ అసలు విషయం తెలియదు. ఏదేమైనా పవన్ ఫ్యాన్స్ కు బర్త్ డే స్పెషల్ గా ఓ.జి మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అంటే మంచి కిక్ ఇచ్చే మేటరే అని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com