Happy Birthdya Mrunal Thakhur: 'హాయ్ నాన్న' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
'సీతారామం'తో టాలీవుడ్ లో ఎనలేని పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో 'హాయ్ నాన్న' సినిమా చేయనున్న విషయం తెలిసిందే. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోందు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మృణాల్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మృణాల్.. గిటారు బ్యాక్ వేసుకుని ఉన్న లుక్ లో ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమాలో మృణాళ్ గిటార్ నేర్పించే టీచర్‌గా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న 'హాయ్ నాన్న' సినిమాను వైరా ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. అబ్దుల్ హేషమ్ వాహబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాని కూతురిగా కియారా ఖన్నా అనే చిన్నారి నటించింది. మరోవైపు ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఓ కీలకపాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ యాక్టర్ అంగద్ బేడీ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.
Happy birthday yashna. Have a wonderful one ♥️
From
Me and Mahi :)@MissThakurani #HiNanna pic.twitter.com/hGtOAGhdD8
— Nani (@NameisNani) August 1, 2023
ఇదిలా ఉండగా.. మృణాల్ ఠాకూర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. దీనికి కారణం ఆమె సీరియల్స్ లో నటించే స్థాయి నుంచి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన తీరే. ఆగస్టు 1, 1992 న జన్మించిన మృణాల్.. కాలేజ్ డేస్ లోనే నటనపై ఆసక్తితో సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. 2012 -13 ప్రాంతంలో ‘ముజ్సే కుచ్ కెహ్తీ..ఖామోషియాన్’ నటించి అందర్నీ ఆకట్టుకుంది. తర్వాత పలు సీరియల్స్ లో నటించి క్రేజ్ సంపాదించుకుంది. ఆమె ఎక్కువ కాలం నటించిన సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ ఇప్పటికీ టీవీల్లో వస్తూనే ఉంటుంది. ఈ సీరియల్ తోనే మృణాల్ కు మంచి గుర్తింపు వచ్చింది. పలు సీరియల్స్, రియాలిటీ షోలలో చేసిన తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి.
మృణాల్ 2014లో మరాఠీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది మరాఠీలో ‘సురాజ్య’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ తర్వాత 2015 లో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఆ ఏడాది హిందీలో ‘లవ్ సోనియా’ అనే సినిమాలో నటించింది. అయితే ఈ మూవీలో ఆమె నటనకు మంచి మార్కులే దక్కినప్పటికీ కమర్షియల్ గా మూవీ హిట్ అందుకోలేదు. తన వెనకాల వచ్చే విమర్శల దాడి జరుగుతున్నప్పటికీ ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వచ్చింది. ‘లవ్ సోనియా’ తర్వాత కూడా మృణాల్ కూ బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. అప్పుడు ఆమె పూర్తి స్థాయి బాలీవుడ్ నటిగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com