Khushbu Sundar : కరోనా వచ్చింది..నన్ను ఎంటర్‌టైన్ చేయండి : ఖుష్బూ

Khushbu Sundar : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. సామాన్యులతో పాటుగా వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ మధ్యే సీనియర్ నటుడు కట్టప్ప కరోనా బారిన పడగా, తాజాగా సీనియర్ నటి, బీజేపే నాయకురాలు ఖుష్బూ సుందర్ వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రెండు వేవ్స్ సమయంలో కరోనా నుంచి తప్పించుకున్నప్పటికీ ఇప్పుడు ఈ వైరస్ కి చిక్కానని అన్నారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని.. ఒంటరిగా ఉండటం తనకు నచ్చడం లేదన్నారు. అయితే రాబోయే ఐదు రోజులు తనని ఎంటర్‌టైన్ చేయాలని అభిమానులను కోరారు ఖుష్బూ.
Ok. finally #Covid catches up with me after dodging last 2 waves. I have just tested positive. Till last eve i was negative. Have a running nose,did a test n Voila! I have isolated myself. Hate being alone. So keep me entertained for the next 5 days. N get tested if any signs 🥰
— KhushbuSundar (@khushsundar) January 10, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com