Khushbu Sundar: 8ఏళ్ల వయసులో మా నాన్న లైంగికంగా వేధించాడు: ఖుష్బు

Kushboo Sundar: ఇటీవలే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW)లో జాతీయ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను పంచుకున్నారు. నటిగా ఎన్నో తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో యాక్ట్ చేసిన ఖుష్బు స్టార్ హీరోలు అందరితో నటించింది. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని తెలిపింది. అయితే తనకు పదిహేనేళ్లు వచ్చిన తరువాతనే ఫిర్యాదు చేయగలిగానని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగాలి. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. మీ మద్దతు, ప్రోత్సాహంతో నేను ఈ పదవిని నిర్వర్తించగలనని నమ్ముతున్నాను అని తన కొత్త పదవిని గురించి తెలిపారు.
చిన్నారులకు బయటే కాదు ఇంట్లో కూడా రక్షణ లేదు. కొందరు చిన్నారులు ఇంటి సభ్యుల ద్వారానే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. అది పిల్లల జీవితానికి మచ్చగా ఉంటుంది. మా అమ్మ మా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడింది. మా నాన్న ఆమెను రోజూ కొడుతుండేవాడు. మమ్మల్ని కూడా కొట్టేవాడు. మానాన్న నన్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అప్పుడు నా వయసు 8 ఏళ్లు. నాకు పదిహేనేళ్లు వచ్చాక కానీ అతడిని ఎదిరించే ధైర్యం రాలేదు. అప్పుడు అతడి మీద ఫిర్యాదు చేశాను. నేను ఈ విషయం చెబితే మా అమ్మ కూడా నమ్మదని బైటికి చెప్పలేదు. భర్త ఎలాంటి వాడైనా భార్య భరిస్తుంది. మా అమ్మ కూడా అలాంటి ఛాందసభావాలు ఉన్న వ్యక్తి. అందుకే అతడిని ఎదిరించే ధైర్యం ఎప్పుడూ చేయలేదు. మేము తిన్నా తినకపోయినా అడిగే వాడు కాదు. పస్తులతో పడుకున్న రోజులు చాలా ఉన్నాయి అని తన చిన్ననాటి జీవితంలోని చేదు జ్ఞాపకాలు పంచుకున్నారు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్న వైనాన్ని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com