జాతీయం

JP Nadda : తెలంగాణలో బీజేపీ బలపడుతుండటం ఓర్వలేక కేసీఆర్ కుట్రలు : జేపీ నడ్డా

JP Nadda : బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

JP Nadda : తెలంగాణలో బీజేపీ బలపడుతుండటం ఓర్వలేక కేసీఆర్ కుట్రలు : జేపీ నడ్డా
X

JP Nadda : బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణలో బీజేపీ బలపడుతుండటం ఓర్వలేక కేసీఆర్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బండిసంజయ్ అరెస్టు విషయాన్ని అంత తేలిగ్గా వదలమని హెచ్చిరించారు నడ్డా. అరెస్టులకు, దాడులకు భయపడే వాళ్లం కాదని... ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగుతుందన్నారు. అంతకు ముందు బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బందితో ఫోన్లో మాట్లాడారు జేపీ నడ్డా. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని... వెనక్కి తగ్గేది లేదని సంజయ్ కి సూచించారు. జాతీయ నాయకత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు.

Next Story

RELATED STORIES