COURT movie : ఓటిటిలోకి వస్తోన్న ‘కోర్ట్’

నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కంటెంట్ బేస్ డ్ మూవీగా వచ్చిన కోర్ట్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా.. ముఖ్యంగా యూత్ బాగా నచ్చేలా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 55 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాని బ్యానర్ కు భారీ లాభాలు తెచ్చింది. ప్రియదర్శి, శివాజీ, రోహిణి, హర్ష్ రోషన్, శ్రీదేవి, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ డైరెక్ట్ చేశాడు. పోక్సో చట్టంలోని లోపాలను, అది ఈ తరానికి తెలియకపోవడం గురించిన సమస్యలను వివరిస్తూనే ఫీల్ గుడ్ టీనేజ్ లవ్, పేరెంట్స్ పెయిన్ ఇలాంటి అంశాలన్నిటినీ అద్భుతంగా డీల్ చేశాడు దర్శకుడు.
ఇక ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చే వేళయింది. ఈ నెల 11 నుంచి కోర్ట్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. థియేటర్ లో బిగ్ హిట్ అయిన సినిమా కాబట్టి ఓటిటిలో కూడా అదే స్థాయిలో ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు. నిజానికి ఇలాంటి సినిమాలకు ఓటిటిలో ఇంకా ఎక్కువ అప్లాజ్ వస్తుంది. మరి కోర్ట్ అలాంటి అప్లాజ్ నే అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com