Allu Arjun : అక్కడా దుమ్మురేపుతున్న పుష్పరాజ్

Allu Arjun :  అక్కడా దుమ్మురేపుతున్న పుష్పరాజ్
X

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ రూపొందించిన సినిమా పుష్ప 2. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ రికార్డులన్నీ ‘ఫాస్టెస్ట్’ కావడం విశేషం. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే అంత లేదు అన్నారు కానీ.. కొన్ని సీక్వెన్స్ లు మాత్రం నిజంగానే అద్దిరిపోయాయి. జాతర ఎపిసోడ్ కు ఫిదా కాని వారు లేరు. ఈ ఐడియా సుకుమార్ ను మరో స్థాయిలో నిలబెట్టింది. ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి లెంగ్తీ సీక్వెన్స్ రాలేదు అంటే అతిశయోక్తి కాదు. బలమైన విలన్ లేకపోయినా.. ఫహాద్ ఫాజిల్ పాత్రకు అన్యాయం జరిగింది అన్నా.. ఆడియన్స్ అవేం పట్టించుకోలేదు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే ఎగబడి మరీ చూశారు. ఈ సినిమా తర్వాతే నార్త్ లో సింగిల్ స్క్రీన్స్ కు మళ్లీ జీవం వచ్చినట్టైందని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ తెగ పొగిడేశారు పుష్ప 2 టీమ్ ను.

ఇక థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకు ఓటిటిలో ఆ రేంజ్ రెస్పాన్స్ రాదు అంటారు. బట్ ఈ సెంటిమెంట్ ను కూడా పుష్పరాజ్ బ్రేక్ చేశాడు. పుష్ప2 ఓటిటిలో కూడా అదరగొడుతోంది. ఇది కూడా ఫాస్టెస్ట్ రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోన్న పుష్ప2 కు 4 రోజుల్లోనే దాదాపు 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంత తక్కువ టైమ్ లో అన్ని వ్యూస్ అనేది ఇండియాలో రికార్డ్ ట కూడా. సో.. మొత్తంగా పుష్ప రాజ్ వెండితెరపైనే కాదు.. ‘ఇంటితెర’పైనా ఇరగదీస్తున్నాడన్నమాట.

Tags

Next Story