Draupathi 2 : మోహన్.జి భారీ చిత్రం ద్రౌపతి2 ఫస్ట్ లుక్ విడుదల

రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘ద్రౌపతి 2’. నట్టి నటరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇంతకు ముందు పళయవన్నార పేట్టై, ద్రౌపతి, రుద్ర తాండవం, బకాసురన్ వంటి హిట్ మూవీస్ ను రూపొందించిన మోహన్.జి ఈ సీక్వెల్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందబోతోంది. నేతాజీ ప్రొడక్షన్స్, జి.ఎం. ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినాయక చవితి ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలో నటిస్తోన్న రిచర్డ్ రిషి చక్రవర్తిలా సింహాసనంపై రాజసంగా కూర్చుని ఉన్న ఈ ఫోటో చూడగానే ఆకట్టుకునేలా ఉంది.
ద్రౌపతి 2.. 14వ శతాబ్దానికి చెందిన కథాంశంతో తెరకెక్కుతోంది. ఆ సమయంలోనే మొఘల్ చక్రవర్తులు తమిళనాడులోకి ప్రవేశించారు. రక్తంతో రాసిన చరిత్రాక ఘటనల ఆధారంగా సినిమా రూపొందుతోంది. దక్షిణ భారతదేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు, వీరత్వం, త్యాగం, రక్తంతో రాసిన చరిత్రకు నిదర్శనంగా నిలిచారు. ఆ చరిత్ర ఆధారంగానే ఈ చిత్రం రూపొందుతోంది. ఇంతకు ముందు 2020లో విడుదలైన ద్రౌపతి చిత్రానికి ఈ సీక్వెల్ కనెక్షన్ ప్రధానంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
మేజర్ పార్ట్ చిత్రీకరణను ముంబైలోనే పూర్తి చేయబోతున్నారు. మిగిలిన భాగాన్ని సెంజి, తిరువణ్ణామలై, కేరళలలో చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీలో వై.జి.మహేంద్రన్, నాడోడిగల్ భరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com