Bollywood: స్టార్ యాక్టర్స్ అంతా అలా పైకొచ్చిన వాళ్లే అంటూ తనని కూడా..

Bollywood: స్టార్ యాక్టర్స్ అంతా అలా పైకొచ్చిన వాళ్లే అంటూ తనని కూడా..
Bollywood: హీరోయిన్లే కాదు హీరోలు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులే.. తాజాగా హిందీ బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి ఎలిమినేట్ అయిన అంకిత్ గుప్తా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనకు జరిగిన అవమానాన్ని వివరించాడు.

ఉదారియన్ సీరియల్‌తో పాపులర్ అయిన అంకిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒకతను నన్ను కాంప్రమైజ్ అవుతావా అని అడిగాడు.. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే కొన్ని పద్ధతులుంటాయి. వాటన్నింటికీ ఓకే అయితేనే ఛాన్సులు వస్తాయి.

పెద్ద పెద్ద సెలబ్రెటీల పేర్లు చెప్పి వాళ్ల ద్వారా తనకు అవకాశాలు వచ్చేలా చేస్తానన్నాడు. ఇప్పుడు స్టార్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న వాళ్లంతా ఒకప్పుడు ఇలాంటి ఎన్నో త్యాగాలు చేశాకే ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పాడు. అతడు అలా చెప్పే సరికి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాను. ఇలాంటివి నేను చెయ్యను..

నేను అలాంటి వాడిని కాదు అని అన్నా వినిపించుకోకుండా నన్ను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడు.. దాంతో వెంటనే అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోయాను. నా జీవితంలో అత్యంత చెత్త అనుభవం ఇది అని చెప్పుకొచ్చాడు అంకిత్.

Tags

Read MoreRead Less
Next Story