Hit 3 : ‘హిట్ 3’ కోసం రంగంలోకి బాలీవుడ్ నటుడు

తెలుగు సినీ ప్రేక్షకులను ఉత్సాహభరితంగా ఉంచే చిత్రాలలో 'హిట్' సిరీస్ ఒకటి. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న 'హిట్-3' చిత్రం పైనే ఉంది ఇప్పుడు అందరి దృష్టి. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతుంది.
క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన హిట్ సిరీస్‌లోని మొదటి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఈ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు కొత్త అర్థాన్ని ఇచ్చింది. అందుకే 'హిట్-3' పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. నాని తన స్వంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నానీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
'హిట్-3' చిత్రం కథాంశం ప్రకారం, దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ విశాఖపట్నంలోని సెంట్రల్ జైలులో జరుగుతోంది.
'హిట్-3' చిత్రంలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని ప్రధాన విలన్ ఎవరు అనేది ఇప్పటి వరకు రహస్యంగా ఉంది. నిజానికి బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. సినిమాలో అతనిది పాజిటివ్ కేరక్టరా లేక నెగెటివ్ కేరక్టరా అనేది ఇంకా తెలియదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com