మీ ప్రేమకి, గౌరవానికి నేను కృతజ్ఞుడిని : సోనూసూద్

మీ ప్రేమకి, గౌరవానికి నేను కృతజ్ఞుడిని : సోనూసూద్
నాకు ఇలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా నాకు గౌరవం.. అయితే ఇది నా స్థాయికి మించిన గౌరవం, దీనికి నేను అర్హుడను కాదు.. త్వరలోనే ఆ ఆలయాన్ని సందర్శిస్తాను..

లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది వలస కూలీలకి అండగా నిలిచి వారిపాలిట దేవుడిలా నిలిచాడు నటుడు సోనూసూద్.. అంతటితో తన సేవలను ఆపకుండా ఇప్పుడు ఎక్కడ కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. ఈ క్రమంలో సోనూసూద్ ని దేవుడి లాగా కొలుస్తూ ఓ అభిమాని ఏకంగా ఆయనికి గుడి కట్టాడు. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం చెలిమితండాకు చెందిన రాజేష్‌ రాథోడ్‌ అనే ఓ అభిమాని సోనూసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రోజూ పూజలు చేస్తున్నాడు.

రాజేష్‌ రాథోడ్‌ సొంత డబ్బులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో స్థానికులు అతన్ని అభినందిస్తున్నారు కూడా. అయితే ఈ వార్త సోనూసూద్ కి తెలియడంతో ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. " నాకు ఇలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా నాకు గౌరవం.. అయితే ఇది నా స్థాయికి మించిన గౌరవం, దీనికి నేను అర్హుడును కాదు.. త్వరలోనే ఆ ఆలయాన్ని సందర్శిస్తాను.. గ్రామస్తులు చూపించిన ప్రేమకి, గౌరవానికి నేను ఎప్పటికి కృతజ్ఞుడిని " అని సోనూసూద్ అన్నారు. ఇక సోనూసూద్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ చిత్రాలలో నటిస్తున్నాడు.


Tags

Read MoreRead Less
Next Story