Alia Bhatt Telugu Speech : ట్రైలర్ పగిలిపోయింది కదా.. ముంబైలో మాకు పిచ్చెక్కింది : అలియా

ఇండియన్ సినిమా మొత్తం ఎదురుచూస్తోన్న మూవీ RRR.. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజై ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ లో పనిపడ్డారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లో శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించింది చిత్రబృందం.. ఇందులో భాగంగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తెలుగులో మాట్లాడి అందరిని సప్రైజ్ చేసింది.
"అందరికి నమస్కారం.. బాగున్నారా.. నేను బాగున్నా.. సినిమా ట్రైలర్ పగిలిపోయింది కదా.. .ముంబైలో మాకు పిచ్చెక్కింది" అంటూ చెప్పింది. కాగా ఈ సినిమాలో అలియా సీత అనే పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా ఏడాది పాటు తెలుగు నేర్చుకోవడం విశేషం. కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాకి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. పిరయాడికల్ మూవీగా వస్తోన్న ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కీరవాణి సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com