అఫ్గన్‌ క్రికెటర్‌తో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

అఫ్గన్‌ క్రికెటర్‌తో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ
Afghan cricketer: తాలిబన్ల గుప్పిట్లో ఆఫ్గనిస్తాన్ వెళ్లిపోవడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

Afghan Cricketer: తాలిబన్ల గుప్పిట్లో ఆఫ్గనిస్తాన్ వెళ్లిపోవడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో మహిళల పట్ల తాలిబన్ల అరాచకాలు శృతిమించిపోయాయి. మహిళలను హింసించడం, సెక్స్ బానిసలుగా మార్చడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే తాలిబన్ల ఆక్రమణ వల్ల తన నిశ్చితార్థం కూడా రద్దయిందని అర్షి ఖాన్ అంటోన్నారు. అర్షి ఖాన్(Arshi Khan) హిందీలో వచ్చిన బిగ్‌బాస్‌ సీజన్‌ 11, 14 కంటెస్టెంట్‌. బిగ్‌బాస్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన అర్షి.

సావిత్రి దేవి కాలేజ్ అండ్‌ హాస్పిటల్', 'విష్', 'ఇష్క్ మే మార్జవాన్' వంటి టీవీ షోలతో పాటు అనేక ఇతర రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోలలో కనిపించారు. ఇదేకాక 'రాత్ కి రాణి బేగం జాన్', 'ది ఈవిల్ డిజైర్స్' వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలిచే అర్షి ఖాన్‌ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో అఫ్గనిస్తాన్‌ క్రికెటర్‌తో తన నిశ్చితార్థం జరగాల్సి ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాలిబన్లు.. అఫ్గన్‌ను ఆక్రమించడంతో అది కాస్త రద్దయ్యిందని తెలిపింది.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్షి ఖాన్‌ మాట్లాడుతూ..నేను అఫ్గనిస్తాన్‌ పఠాన్‌ను. నా కుటుంబం యూసుఫ్ జహీర్ పఠాన్ జాతికి చెందినది. నా తాత అఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చారు.. భోపాల్‌లో జైలర్‌గా ఉన్నారు. నా మూలాలు అఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాయి.. అయినప్పటికి నేను భారతీయ పౌరురాలినే" అన్నారు అర్షి ఖాన్.

ఈ ఏడాది అక్టోబర్‌లో నా నిశ్చితార్థం ఓ అఫ్గనిస్తాన్‌ క్రికెటర్‌తో జరగాల్సి ఉంది. అతన్ని మా నాన్న సెలక్ట్‌ చేశారు. ఆ క్రికెటర్‌ మా నాన్న మిత్రుడి కుమారుడు. కానీ తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించడంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాం. అయినప్పటికి కూడా మేం మంచి మిత్రులుగానే ఉన్నాం అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story