Deepika Padukone : ఏడాది బ్రేక్ తీసుకోబోతున్న బాలీవుడ్ హీరోయిన్

Deepika Padukone : ఏడాది బ్రేక్ తీసుకోబోతున్న బాలీవుడ్ హీరోయిన్
X

దీపికా పదుకొణె ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. అయినా.. ఈ ఏడాది చివరి నాటికి ఆమె తన కొత్త హిందీ చిత్రం సెట్స్‌కి తిరిగి రానుందని వార్తలు వచ్చాయి. అయితే దీపికా పదుకొణె ఒక ఏడాది పాటు విరామం తీసుకుంటున్నట్లు వినికిడి. ప్రముఖ టీవీ షో ‘ది వైట్ లోటస్’ మూడవ సీజన్‌ను దీపిక తిరస్కరించినందున ఈ వార్తకు మరింత బలం చేకూరింది.

ఇంతకు ముందు.. ఆమెకు రోహిత్ శెట్టి కాప్ డ్రామా ఆఫర్ వచ్చింది. ఇది 2025 ప్రథమార్థంలో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది, దానిని కూడా ఆమె తిరస్కరించింది. కాబట్టి దీపిక తన లక్ష్యాలను సరిగ్గా నిర్దేశించుకుంది. తన బిడ్డ కొద్దిగా ఎదిగినప్పుడు మాత్రమే సినిమాల్లోకి తిరిగి రావాలని నిర్ణయించుకుంది.

దీపిక చివరిగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ADలో కనిపించింది. ఆ తర్వాత ఇంక ఎలాంటి హిందీ చిత్రానికి సైన్ చేయలేదు. మరి ఈ బ్రేక్ నుంచి తిరిగి వచ్చాకా ఆమె ఎలాంటి ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటుందో చూడాలి.

Tags

Next Story