ఆ స్టార్ హీరోయిన్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

ఆ స్టార్ హీరోయిన్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!
Bollywood: సినిమా సార్ట్స్, స్పోర్ట్స్‌ సెలబ్రిటీలు బయటకు అడుగు పెడితే చాలు అభిమానులు వారిచూట్టూ గుమిగూడతారు.

Deepika Padukone: సినిమా సార్ట్స్, స్పోర్ట్స్‌ సెలబ్రిటీలు బయటకు అడుగు పెడితే చాలు అభిమానులు వారిచూట్టూ గుమిగూడతారు. ఇక వారితో సెల్ఫీలు కోసం ఎగబడతారు. కొన్ని సార్లు అభిమానులు హద్దులుదాటతారు. దాంతో సెలబ్రిటీలు బౌన్సర్స్‌, బాడీగార్డ్స్‌ నియమించుకుంటారు. అయితే బాలీవుడ్ హీరోహీరోయిన్లు తన సెక్యూరిటీ కోసం నియమించుకున్న బాడీగార్డ్స్ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. పెద్దపెద్ద కంపెనీల సీఈఓల ఏడాది జీతాలకంటే బాడీగార్డ్స్ ఇచ్చే జీతం ఎక్కువ.

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె బాడీగార్డ్ ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం ఇస్తుందట. షాక్ తిన్నారా? అవును అక్షరాల 1.2 రెండు కోట్ల రూపాయల జీతం ఇస్తుంది. దీపికా పదుకొణె ఎక్కడకెళ్లినా ఆమె బాడీగార్డు ఆమెకు దగ్గరుండి రక్షణ కల్పించాల్సిందే. దీపికా బాడీగార్డ్ పేరు జలాల్‌.. గత కొన్ని ఏళ్లుగా దీపికాకు బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ఈ బాలీవుడ్ భామ జలాల్‌ ను తమ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటుంది. ప్రతి ఏటా రాఖీ కూడా కడుతుందీ.అంతేకాదు దీపికా రణ్‌వీర్‌ వివాహ వేడుక రోజు సెక్యూరిటీ హెడ్‌గానూ విధులు నిర్వర్తించారు జలాల్‌.

బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికాన్ని తీసుకునే హీరోయిన్ల జాబితాలో ఒకరు. పఠాన్‌తో పాటు ప్రభాస్‌- నాగ్‌అశ్విన్‌ జోడిలో రాబోతున్న చిత్రంలోనూ సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా వస్తున్న '83' చిత్రంలో నటిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story