Kajol : రామోజీ ఫిల్మ్ సిటీ హాంటెడ్ హౌస్ లాంటిది

దేశంలోనే అత్యంత పెద్దదైన రామోజీ ఫిల్మ్ సిటీపై బాలీవుడ్ నటి కాజోల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె నటించిన ‘మా’ అనే మూవీ ప్రమోషన్స్ లో ఉన్నప్పుడు తనకు ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా.. ‘షూటింగ్ కు వెళుతున్నప్పుడు అంతా బానే ఉంటుంది. కానీ కొన్ని లొకేషన్స్ మాత్రం బాగా ఇబ్బంది పెడతాయి. చాలా నెగెటివ్ వైబ్ తో కనిపిస్తాయి. అలాంటి వాటిలో రామోజీ ఫిల్మ్ సిటీ ఒకటి. నేను అక్కడ షూటింగ్ చేస్తున్నంత కాలం చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. చాలా నెగెటివ్ వైబ్స్ కనిపించాయి. ఇంకా చెప్పాలంటే అదో హాంటెడ్ హౌస్ లాంటి అనుభవాన్నిచ్చింది. ఇకపై అక్కడ షూటింగ్ అంటే అస్సలు చేయను..’అని చెప్పింది. మరి కాజోల్ కావాలనే రామోజీ ఫిల్మ్ సిటీని టార్గెట్ చేసి ఈ మాటలు అన్నదా.. లేక నిజంగానే తనకు అలాంటి అనుభూతి కలిగిందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి దేశ విదేశాల టెక్నీషియన్స్, మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీని ఓ అద్భుతం అని కితాబునిచ్చారు. ఎలాంటి జానర్ సినిమా అయినా ఈ సిటీలోనే మొత్తం కంప్లీట్ చ చేసుకునేంత ఫెసిలిటీస్ ఉన్నాయి అని పొగిడారు. అలాంటి ప్లేస్ ను ఏకంగా దెయ్యాల కొంప( హాంటెడ్ హౌస్ అంటే దాదాపు అర్థమదే)తో పోల్చడం చూస్తుంటే కాజోల్ కు పర్సనల్ ఇంకేదో ఫీలింగ్ ఉన్నట్టుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com