Kangana Ranaut : 'మీలాంటి రోల్ మోడల్ ఉండటం అదృష్టం'.. జక్కన్న పై కంగనా

Kangana Ranaut : బాహుబలి మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR).. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా మార్చి 25న భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సంపాదించుకుంది. వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది ఈ చిత్రం. ఈ మూవీ చూసిన సినీ ప్రముఖులు దర్శకుడు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రాజమౌళి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాజమౌళి ఫొటోను షేర్ చేస్తూ.. 'రాజమౌళి సార్ గొప్ప దర్శకుడని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన కెరీర్‌లోనే ప్లాప్ సినిమాలు లేదు, భవిష్యత్తులో కూడా ఉండవు' అని రాసుకొచ్చింది. అంతేకాకుండా.. రాజమౌళి ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మాత్రమే కాదు... మంచి మానవత్వం ఉన్న గొప్ప మనిషి... దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయన చూపించే ప్రేమ గొప్పది. మీలాంటి రోల్ మోడల్ ఉండటం అదృష్టం... నిజాయితిగా నేను మీకు పెద్ద అభిమానిని' అంటూ కంగనా రాసుకొచ్చింది.
ఇక RRR సినిమా తన కుటుంబంతో కలిసి రేపు వెళ్తున్నానని పేర్కొంది. కాగా రూ. 450 కోట్లతో తెరకెక్కన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరిగా నటించగా, వీరి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించి మెప్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com