Raj Kundra Case: ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ సీక్రెట్లు..!

Rajkundra file photo
Raj Kundra Case: బాలీవుడ్‌లో బ్లూఫిల్మ్ రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు రాజ్‌కుంద్రాను కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు. ఈజీ మనీ కోసమే ఆయన ఈ పోర్నోగ్రఫీవైపు వెళ్లారా.. ఇంకా ఎవరెవరికి దీంతో ప్రమేయం ఉంది అనేది తేల్చేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. UKలోని తన బంధువుతో కలిసి రాజ్‌కుంద్రా ఈ ఫిల్మ్‌లను ఎలా అప్‌లోడ్ చేస్తున్నాడో తెలుసుకోనున్నారు. అలాగే.. ఈ మొత్తం రాకెట్‌ను ఛేధించడంలో ఇప్పుడు వాట్సప్ చాటింగ్‌లు, కొన్ని మెయిల్స్ కూడా కీలకంగా మారిన నేపథ్యంలో వాటిపైనా ఆరా తీస్తున్నారు.
'హెచ్ అకౌంట్స్' పేరుతో ఉన్న వాట్సప్ గ్రూప్‌లో లావాదేవీల సంగతేంటి..? దానికి అడ్మిన్‌గా రాజ్‌కుంద్రా ఎందుకు ఉన్నారు..? మోడల్స్‌కు ఇచ్చినట్టు చెప్తున్న రెమ్యునరేషన్ లెక్కలకు ఏం వివరణ ఇస్తారనేది ఇప్పుడు విచారణలో తేలనుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. పోర్న్ ఫిల్మ్స్ ద్వారా రాజ్‌కుంద్రా గ్యాంగ్ నెలకు 60 లక్షల వరకూ సంపాదిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 7 కోట్ల 50 లక్షల్ని పోలీసులు సీజ్ చేశారు.
భారత్‌లో చట్టాల నుంచి తప్పించుకునేందుకు పోర్న్ ఫిల్మ్స్‌ని UK నుంచి అప్‌లోడ్ చేయిస్తున్న ఈ బ్లూఫిల్మ్ రాకెట్‌లో రాజ్‌కుంద్రా బంధువు ప్రదీప్ భక్షీకి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతనికి చెందిన కెన్‌రిన్ సంస్థ ద్వారానే ఈ బూతు కంటెంట్ ఇంటర్నెట్‌లోకి అప్‌లోడ్ అవుతోంది. హాట్‌షాట్ యాప్ లాంటి వీటిల్లో ఈ పోర్న్ వీడియోలు చూడడానికి ఇంత ధర అని పెట్టడం ద్వారా వీళ్లంతా బాగా సంపాదిస్తున్నారు.
ముంబైలో తీస్తున్న ఈ బూతు సినిమాలకు భక్షీ కొంత పెట్టుబడి పెట్టినట్టు క్రైం బ్రాంచ్ క్లూస్ రాబట్టింది. ఐతే.. అవి అశ్లీల చిత్రాలు కాదని రాజ్‌కుంద్రా లాయర్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇంకెలాంటి మలుపులు ఉంటాయో అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
OTTలో వెబ్‌సిరీస్ అవకాశం అంటూ మెల్లిగా వాళ్లను పోర్న్ లోకి లాగుతున్న ఈ వ్యవహారం ఫిబ్రవరిలో బయటపడినప్పుడే సంచలనమైంది. అప్పట్లో ఈకేసులో అరెస్టై తర్వాత బెయిల్‌పై విడుదలైన గెహనా వశిష్ట్ ఇప్పుడు రాజ్‌కుంద్రాకు మద్దతుగా నిలిచింది. ఆమెకు చెందిన 8 వీడియోలు అప్‌లోడ్ కూడా ఈజీ మనీ కోసమేనని ఆరోపణలు వచ్చినా.. వాటిని ఖండిస్తోంది. ఈ పోర్న్ రాకెట్‌లో ఇప్పటికి 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. త్వరలోనే మరిన్ని ఆధారాలతో కేస్ క్లోజ్ చేసేపనిలో ఉన్నారు. ఒకవేళ ఈ పోర్నోగ్రఫీ కేసు రుజువైతే 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com