Tara Sutaria : యశ్ టాక్సిక్ లో బాలీవుడ్ భామ తారా.. క్లారిటీ ఇదిగో!

యశ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్', భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో తాను భాగమైనట్లు వస్తోన్న వార్తలపై బాలీవుడ్ నటి తారా సుతారియా స్పందించారు. ఆయా వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు.
'ఓ ప్రాజెక్ట్ నేను భాగమయ్యానంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ కథనాల్లో వాస్తవం లేదు. ఆ సినిమా లో యాక్ట్ చేస్తున్నానని నేను ఎక్కడా చెప్పలేదు. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా మీ అందరితో పంచుకుంటా. నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటా. ఎవరూ ఎవరికీ రెండో మనిషి కాలేరు." అని
ఆమె రాసుకొచ్చారు.
యశ్ 19వ చిత్రంగా 'టాక్సిక్' రూపు దిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమో హన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. యశ్ కు జోడీగా నటి కియారా అద్వానీ కనిపించనున్నారని.. రెండో హీరోయిన్ గా తారా సుతారియా నటించే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com