Bollywood : తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ భామల క్యూ

Bollywood : తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ భామల క్యూ
X

తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ భామలు ఆసక్తి కనబర్చుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతుండటం, భారీ బడ్జెట్ తో నిర్మితమవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో అందరి చూపు ఇప్పుడు టాలీవుడ్ పై పడింది. తెలుగులో వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, కల్కి చిత్రాలు భారతీయ సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లాయి. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేయడానికి 'దేవర' సిద్ధం కాగా.. పుష్ప 2, ఎస్ఎస్ఎంబీ 29 రికార్డు నెలకొల్పడానికి రెడీ అవుతున్నాయి. ప్రస్తుత క్రేజ్ కారణంగా తెలుగు సినిమాల్లో నటించడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు టాలీవుడ్ పై కన్నేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ భామలు కృతి సనన్, కియారా అద్వానీ, శ్రద్ధాకపూర్, దీపికా పదుకొణె తదితరులు తెలుగు సినిమాల్లో నటించారు. వాళ్ల బాటలోనే అలనాటి అందాల నటి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ కూడా దేవరతో ఎంట్రీ ఇచ్చి ఆర్సీ 16లోనూ నటిస్తోంది. చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, కొత్తగా వస్తున్న నటీమణులు తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంచి కథ దొరికితే తెలుగులోనూ నటిస్తానని చెబుతోంది సారా అలీఖాన్. ఒక్కరేమిటీ ఇప్పుడు టాలీవుడ్ అందరినీ ఆకర్షిస్తోంది.

Tags

Next Story