Bollywood: పరిణీత, మర్దానీ దర్శకుడు ప్రదీప్ సర్కార్ ఇక లేరు
Bollywood: బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు ప్రదీప్ సర్కార్ ఈ తెల్లవారుజామున 3 గంటలకు ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. పరిణీత, హెలికాప్టర్ ఈలా, మర్దానీ వంటి చిత్రాలను రూపొందించిన ప్రదీప్ సర్కార్ వయసు 67. చిత్రనిర్మాత హన్సల్ మెహతా ఈ విషాదకరమైన వార్తను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “ప్రదీప్ సర్కార్. దాదా. RIP." అని పోస్ట్ చేశారు. ప్రదీప్ సర్కార్ డయాలసిస్‌లో ఉన్నారు. అతని పొటాషియం స్థాయిలు బాగా పడిపోయాయి. తెల్లవారుజామున 3 గంటలకు పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సర్కార్ తుదిశ్వాస విడిచారు. బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో ముంబయిలోని శాంతాక్రూజ్ శ్మశానవాటికలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సర్కార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సర్కార్ ఏప్రిల్ 1955లో జన్మించారు. అతడు దర్శకత్వం చేపట్టిన మొదటి చిత్రం విద్యాబాలన్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ నటించిన పరిణీత. ఆ తర్వాత అతను రాణి ముఖర్జీ, కొంకణా సెన్ శర్మ, అభిషేక్ బచ్చన్ నటించిన లగా చునారి మే దాగ్‌కి దర్శకత్వం వహించారు. అతని దర్శకత్వంలో కాజోల్ నటించిన లఫాంగీ పరిండే, మర్దానీ, హెలికాప్టర్ ఈలా కూడా ఉన్నాయి. ఇదే అతడి చివరి చిత్రం కూడా. ఇటీవల ZEE5లో వచ్చిన వెబ్ సిరీస్ దురంగకు దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక ఏబీ అవార్డు, రాపా అవార్డు, జాతీయ చలనచిత్ర అవార్డు ప్రదీప్ సర్కార్‌ను వరించాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com