Allu Arjun : అల్లు అర్జున్ కు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ సలామ్

Allu Arjun :  అల్లు అర్జున్ కు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ సలామ్
X

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ సలామ్ కొడుతున్నారు. తెలుగు, కేరళలో యావరేజ్ గా పుష్ప 2 హవా నార్త్ లో సునామీలా ఉందనేది నిజం. అందుకు వస్తోన్న కలెక్షన్లే నిదర్శనం. ఆల్రెడీ ఇండియా నుంచి అత్యంత వేగంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో పాటు ఇంకెన్నో కొత్త రికార్డులు నెలకొల్పిందీ మూవీ. సుకుమార్ మ్యాజిక్, అల్లు అర్జున్ క్యారెక్టర్ లో జీవించడం, రష్మిక మందన్నా నటన, గ్లామర్, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఫహాద్ ఫాజిల్ నటన ఇవన్నీ ఎసెట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇది ఊరమాస్ సినిమా. కాస్త క్లాస్ అయినా ఆకట్టుకోవడం కష్టం. అందుకే పుష్ప 2 సింగిల్ స్క్రీన్స్ లో అదరగొడుతోంది. ఇదే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ అల్లు అర్జున్ కు సలామ్ కొట్టడానికి కారణం.

ప్రస్తుతం పుష్ప 2 మూవీ టీమ్ థ్యాంక్ యూ మీట్ పేరుతో దేశవ్యాప్తంగా సెలెక్టెడ్ సిటీస్ లో మరోసారి టూర్ వేస్తోంది. ఈ టూర్ లో భాగంగానే అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడనంత లాభాలు చూశాం అన్న ఆనందంతో పాటు పుష్ప2 తో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు మళ్లీ కొత్త జీవం వచ్చేలా చేసినందుకు వాళ్లంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మల్టీప్లెక్స్ లు వచ్చినా.. సింగిల్ స్క్రీన్స్ వల్లే సినిమాలు బ్రతుకుతాయి అనేది నిజం. సింగిల్ స్క్రీన్స్ హ్యాపీగా ఉంటేనే ఇండస్ట్రీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ తెలుగులో అత్యాశకు పోయి అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచుకుని ఓ రకంగా పుష్ప 2 తో ఇండస్ట్రీయే సెల్ఫ్ గోల్ చేసుకుంది. రాబోయే రోజుల్లో ఏ పెద్ద హీరో సినిమా అయినా టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిందే. వెళ్లిన వారికి వాళ్లు అనుమతి ఇవ్వాల్సిందే. ఆ కారణంగా సాధారణ జనం థియేటర్ల వైపు చూడటం కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇది తెలిసీ దారుణంగా టికెట్ ధరలు పెంచడం ఖచ్చితంగా సెల్ఫ్ గోల్. అలా పెంచకున్నా.. పుష్ప 2 నార్త్ లో వందల కోట్లు వసూలు చేస్తోంది. అదీ మాస్ పల్స్ తెలుసుకోవడం అంటే. ఏదేమైనా పుష్ప 2 ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్స్ కు, సింగిల్ స్క్రీన్స్ కు కొత్త లైఫ్ ఇచ్చిందనేది వాస్తవం.

Tags

Next Story