Sonam Kapoor: తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ తో ఫోటో షూట్

Sonam Kapoor: బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్, భర్త ఆనంద్ అహూజాతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి. అభిమానులతో ఓ సంతోషకరమైన వార్తను పంచుకుంది. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలియజేస్తూ బేబీ బంప్ తో దిగిన చిత్రాలను పోస్ట్ చేసింది.
సోనమ్ తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నామని ఫోటోలను షేర్ చేసింది. సోనమ్, ఆనంద్ 2018లో పెళ్లి చేసుకున్నారు. ఆమె తన ఇన్ స్టా పేజీలో ఫోటోలను షేర్ చేస్తూ.. "నాలుగు చేతులు.. నిన్ను ఉత్తమంగా పెంచడానికి, రెండు హృదయాలు.. నీ గుండె చప్పుడు వినడానికి.. ఒక కుటుంబం.. నీపై ప్రేమ కురిపించడానికి ఎదురు చూస్తోంది. ఇంక మేము వేచి ఉండలేము... నీకు హృదయపూర్వక స్వాగతం అని కవితాత్మకంగా రాసింది. తన బిడ్డను ప్రేమ పూర్వకంగా ఆహ్వానించడానికి రెడీగా ఉన్నామని తెలియజేసింది.
2021లో సోనమ్ కపూర్ ప్రెగ్నెన్సీ పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కాగా భార్యా భర్తలిద్దరూ ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు.
సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహూజా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త హరీష్ అహుజా కుమారుడు. అతను భారతదేశంలోనే అతిపెద్ద ఎగుమతి సంస్థ అయిన షాహీ ఎక్స్‌పోర్ట్స్ యజమాని. షాహీ ఎక్స్‌పోర్ట్స్ MDగా పనిచేస్తున్నాడు, దీని వార్షిక టర్నోవర్ $450 మిలియన్లకు పైగా ఉంది. ఆనంద్‌కు ఇద్దరు తమ్ముళ్లు అమిత్, అనంత్ అహుజా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com