Kajal Aggarwal: బాలీవుడ్‌లో క్రమశిక్షణ లేదు: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal: అందమైన చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లై ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ నందమూరి బాలకృష్ణ #NBK108తో టాలీవుడ్‌లో సందడి చేయడానికి రెడీ అవుతోంది. తన వృత్తిపరమైన నటనలో సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రముఖ మీడియా గ్రూప్ నిర్వహించిన రైజింగ్ ఇండియా ఈవెంట్‌లో కాజల్ పాల్గొంది. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలపై కాజల్ తన ఆలోచనలను పంచుకుంది. యాంకర్ ఆమెను సౌత్ సినిమా మరియు నార్త్ సినిమాలో మీరు దేనిని ఇష్టపడతారు అని అడిగినప్పుడు, కాజల్ ఇచ్చిన సమాధానం.. "నేను దక్షిణాది పరిశ్రమ యొక్క నైతిక విలువలు, క్రమశిక్షణను నేను ఇష్టపడతాను. అది హిందీ సినిమాలో లోపించిందని నేను భావిస్తున్నాను" అని కాజల్ అగర్వాల్ అన్నారు. ఈ వ్యాఖ్యలు టిన్సెల్ టౌన్‌లో వైరల్‌గా మారాయి. సౌత్ సినిమాలు నార్త్ బెల్ట్‌లో పెద్ద మొత్తంలో వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో కాజల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది నటీనటులు ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడుతారు.. ఇండియన్ సినిమా అని ప్రస్తావిస్తారు తప్పించి సౌత్ సినిమా, నార్త్ సినిమా అని విభేదాలు చూపరు. కాజల్ బాలీవుడ్‌లో పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. ఆమె హిందీ సినిమాలో సక్సెస్ కాలేకపోయింది. కానీ దక్షిణాన ఆమె నటించిన అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com