Kiara Advani : బాలీవుడ్‌లో మరో బ్రేకప్.. ప్రియుడికి గుడ్‌బై చెప్పిన కియారా..!

Kiara Advani : బాలీవుడ్‌లో పెళ్లి వరకు వచ్చిన కొన్ని ప్రేమ కథలు బ్రేకప్ లుగా మారుతున్నాయి. లైగర్ బ్యూటీ అనన్య పాండే తన ప్రియుడు ఇషాన్ ఖట్టర్‌కి బ్రేకప్ చెప్పిందన్న వార్త ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారగా, తాజాగా బీ టౌన్‌లో మరో లవ్ బర్డ్స్ విడిపోయారన్న వార్త హాల్‌చల్ చేస్తోంది. కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హ్రోత్రా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.. డేటింగ్ చేస్తున్న సమయంలో షెర్షా అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.
ఆ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అంతేకాకుండా మూవీ ప్రమోషన్‌లో కూడా వీరు చేసిన హంగామా మీడియా పతాక శీర్షికలను ఆకర్షించాయి. ఓ దశలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఇద్దరు విడిపోయారన్న వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి.
కియారా బ్రేకప్ వార్తలు నిజమే అంటూ సన్నిహితులు క్లారిటీ ఇస్తున్నారు. వారి విడిపోవడానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, ఇద్దరు గతకొద్దిరోజులుగా కలుసుకోవడం మానేశారని తెలుస్తోంది. కియారా అద్వానీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న RC15లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com