Tumbbad Re-Release : బాలీవుడ్ క్రేజీ మూవీ రీ రిలీజ్

Tumbbad Re-Release : బాలీవుడ్ క్రేజీ మూవీ రీ రిలీజ్
X

కొన్ని సినిమాలు థియేటర్స్ లో మిస్ అవుతాం. అవి చూసిన వాళ్లు ఆ మూవీస్ గురించి అదే పనిగా చెబుతూ ఉంటే అరే.. అనవసరంగా మిస్ అయ్యామా అనిపిస్తుంది. అలాగే వారి అభిప్రాయాలు నిజంగా నిజమైనవేనా అనితెలుసుకోవాలన్న కోరిక కూడా ఉంటుంది. దాందేముందీ.. థియేటర్స్ చూడకపోయినా.. ఓటిటిలు, టివిలు ఉన్నాయి కదా అనిపిస్తుంది. బట్ థియేటర్స్ లోనే బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మూవీస్ కొన్ని ఉంటాయి. అలాంటిదే తుంబాద్. రాహి అనిల్ బార్వే డైరెక్ట్ చేసిన ఈ ఫోక్లోర్ హారర్ మూవీకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ఓ గుహ.. వైవిధ్యమైన నేపథ్యం.. చూడగానే భయంగొలిపే యాంబియన్స్.. దాని వెనక ఓ జానపద గాథ. గుహలోకి వెళితే తిరిగి రారు అన్న పుకార్లు. ఎవరో ఒకరు వెళ్లి.. ధైర్యంగా అందులోని నిధితో బయటకు రావడం.. అటుపై జరిగే పరిణామాలు.. ఇవన్నీ తుంబాద్ లో కనిపిస్తాయి. దీంతో పాటు ఓ సందేశం కూడా ఉంటుంది. 2018లో ఏ స్టార్ కాస్ట్ లేకుండా విడుదలైన ఈ మూవీ కేవలం మౌత్ టాక్ తోనే సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయ్యామని ఫీలయ్యే వాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్లందరూ సెప్టెంబర్ 13న రెడీగా ఉండండి.


ఎంతోమందికి మోస్ట్ ఫేవరెట్ అయిన తుంబాద్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ ఉన్న మూడ్ కు తుంబాద్ ఈ సారి బాక్సాఫీస్ దగ్గర ఇంకా గట్టిగా సౌండ్ చేసే అవకాశం ఉంది.

Tags

Next Story