Emergency : ఎమర్జెన్సీపై వారంలో నిర్ణయం తీసుకోండి : బాంబే హైకోర్టు ఆదేశం
బాలీవుడ్ తార, ఎంపీ కంగన రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకు సర్టిఫికేషన్ విషయంలో వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స సర్టిఫికేషన్ ను ఆదేశించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇందిర పాత్రలో కంగనా రనౌత్.. ఇతర పాత్రల్లో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి తదితరులు నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. సినిమాలో తమని తక్కువగా చూపించారని.. విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్య ప్రదేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. మరోవైపు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) పార్టీ కూడా సెన్సార్ బోర్డును కోరింది. చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించి ప్రేక్షకుల్లో ద్వేషాన్ని పెంపొందింపజేసేలా ఈ చిత్రం ఉందని లేఖ రాసింది. ఈ క్రమంలోనే కంగన, చిత్ర నిర్మాణసంస్థ జీ ఎంటర్టైన్మెంట్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స సర్టిఫికేషన న్ను తాము ఆదేశించలేమని ఇటీవల హైకోర్టు స్పష్టంచేసింది. తాజా విచారణ అనంతరం వారం రోజుల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com