శిల్పాశెట్టికి బాంబే హై కోర్టు షాక్..
Bombay High Court: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ముంబయి హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. అశ్లీల చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన భర్త రాజ్‌కుంద్రాపై ...ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్‌మీడియాలో కథనాలను అడ్డుకోవాలని...కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శిల్పాశెట్టి పిటిషన్‌ను విచారణ చేపట్టిన నాయస్థానం...అలాంటి కథనాలు రాకుండా అడ్డుకోలేమని స్పష్టం చేసింది.
పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా.. పరువుకు నష్టం వాటిల్లే విధంగా...మీడియా వ్యవహరిస్తోందని ఆయన భార్య సినీనటి శిల్పాశెట్టి ముంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పలు మీడియా సంస్థలతో పాటు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో తమ గురించి తప్పుగా రాస్తున్నారని శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేసింది. పిటిషన్‌ను శుక్రవారం విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు. భార్యాభర్తల మధ్య జరిగిన విషయాన్ని మీడియాలో వెల్లడించడం సరికాదంటూ శిల్పాశెట్టి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు.
పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు విన్న తర్వాత స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్‌పటేల్....పోలీసులు చెప్పిన వివరాలను ప్రసారం చేయడం పరువుకు నష్టం కలిగించినట్లు కాదన్నారు. ప్రతిదాన్నీ అడ్డుకోవాలంటే పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపినట్లవుతుందని తెలిపారు. భార్యాభర్తల మధ్య సంభాషణ పోలీసుల ముందే జరిగిందన్న న్యాయమూర్తి.. క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు చెప్పిన వివరాలనే మీడియా రిపోర్టులు వచ్చాయని అన్నారు.
సెలబ్రిటీల జీవితంపై ప్రజలు ఆసక్తితో పరిశీలిస్తూ ఉంటారన్న ధర్మాసనం...పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఆమె భర్తతో ఎందుకు వాదన పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఇలాంటి విషయాల్లో మీడియా స్వేచ్ఛను అడ్డుకునేలా కోర్టు వ్యవహరించదన్నారు న్యాయమూర్తి. అయితే పిటిషనర్ పిల్లల పెంపకం గురించి మీడియాలో కథనాలు రావడం మాత్రం.. అభ్యంతరకరమైనదే".వ్యాఖ్యానించిది ధర్మాసనం.
ఈనెల 19న అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రాజ్‌కుంద్రా పై...ఇటీవలే కొందరు బాధితులు ఒక్కొక్కరుగా తమగోడు వెల్లబోసుకుంటున్నారు. రాజ్‌కుంద్రా తమను ఎలా వంచించాడో పోలీసులకు చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు. కుంద్రా కొందరిపై లైంగికదాడికి కూడా పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉండి అవకాశాలు లేనివారికి డబ్బు ఆశ చూపిన రాజ్‌కుంద్రా.. మరికొందరికి బాలీవుడ్‌లో అవకాశాలను ఎరగా వేసినట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com