Boney Kapoor : బాహుబలి నిర్మాతలపై విరుచుకుపడ్డ బోనీ కపూర్

బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ బాలీవుడ్ నిర్మాత శోభు యార్లగడ్డపై విరుచుకుపడ్డాడు. శ్రీదేవిని బ్లేమ్ చేయడంలో వీరి పాత్రే కీలకం అన్నాడు. అంతే కాదు.. రాజమౌళిని రాంగ్ గా గైడ్ చేసిన అసలు దోషులు వీళ్లే అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శ్రీదేవి చనిపోయిన ఇన్నాళ్ల తర్వాత బాహుబలి నిర్మాతలను దోషులు అనడమేంటీ అనుకుంటున్నారా..? యస్.. బాహుబలి టైమ్ లో శివగామి పాత్రకు ముందుగా శ్రీదేవిని అనుకున్నాడు రాజమౌళి. కానీ ఆమె అనేక కండీషన్స్ పెట్టిందని.. తనకు ఓ హోటెల్ లో ఫ్లోర్ మొత్తం కావాలన్నదని.. వీళ్లు చెప్పినదానికంటే రెండు రెట్లు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందనీ.. తనతో పాటు తన అసిస్టెంట్స్ అందరికీ లక్జరీ హోటెల్స్ కావాలన్నది అనీ.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.. రావడమేంటీ.. అవన్నీ నిజమే అని స్వయంగా రాజమౌళే చెప్పుకున్నాడు. ఆ తర్వాత తనది తప్పు అయిందని ఒప్పుకున్నాడులెండి.. అది వేరే విషయం.
ఇక ఇదే విషయం గురించి తాజాగా బోనీకపూర్ ను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. అందుకు బోనీకి చాలా కోపం వచ్చింది. అసలు శ్రీదేవి గురించి అంత చెడుగా వార్తలు రావడానికి కారణం బాహుబలి నిర్మాతలే అని తేల్చి చెప్పాడు. వాళ్లే రాజమౌళికి లేనిపోనివి చెప్పారన్నాడు. అందుకు తనే సాక్షినని.. కావాలంటే ఇదే విషయం ఆ నిర్మాతల మొహంపైనే చెబుతా అన్నాడు. నిజానికి ఆమెకు ఆ నిర్మాతలు.. ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీలో తీసుకున్న దానికంటే తక్కువ ఆఫర్ చేశారన్నాడు. అంతే కాదు.. నిజంగా శ్రీదేవి ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ కాకపోతే.. రామానాయుడు ఆమెతో 6 సినిమాలెందుకు చేస్తాడు.. రాఘవేంద్రరావు 20 సినిమాల్లో ఎందుకు తీసుకుంటాడు.. చిరంజీవి ఎందుకు సినిమాలు చేస్తాడు. రాకేష్ రోషన్, యశ్ చోప్రా.. లాంటి వాళ్లంతా ఆమెతో సినిమాలెందుకు చేస్తారు. శ్రీదేవి డిసిప్లిన్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అలాంటి నటి గురించి అంత చెడుగా మాట్లాడుకోవడానికి కారణం బాహుబలి నిర్మాతలే అన్నది బోనీ కపూర్ వాదన. ఈ విషయం అర్థమయ్యే.. కొన్నాళ్ల తర్వాత రాజమౌళి మీడియా ముఖంగా శ్రీదేవికి సారీ చెప్పాడు.
ఇక ఇదే విషయంలో శ్రీదేవి కూడా అప్పట్లో మీడియాకు వివరంగా చెప్పింది. తన గురించి అందరికీ తెలుసు అని.. నేను నిర్మాతలకు ఇబ్బంది పెట్టినట్టు తన కెరీర్ లో ఒక్క వార్త కూడా లేదు అంది. అలాగే తమకూ ఓ నిర్మాణ సంస్థ ఉందన్న విషయం నేనెలా మర్చిపోతాను అంది. అలాగే తన గురించి మాట్లాడిన వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని కూడా చెప్పింది. ఏదేమైనా ఆమె మరణించిన తర్వాత కూడా ఇదే విషయం మరోసారి రైజ్ అవడం.. దానికి బోనీ ఫైర్ అవడంతో బాహుబలి నిర్మాతలు ఫస్ట్ టైమ్ ఈ విషయంలో పాయింట్ అవుట్ అయ్యారు. మరి దీనికి వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com