'last picture': అపురూప సౌందర్యం అందర్నీ విడిచి వెళ్లి అప్పుడే అయిదేళ్లు..

last picture: అపురూప సౌందర్యం అందర్నీ విడిచి వెళ్లి అప్పుడే అయిదేళ్లు..
'last picture': ఈ రోజు శ్రీదేవి వర్ధంతి సందర్భంగా భర్త బోనీకపూర్ తనతో ఉన్న చివరి చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

'last picture': ఈ రోజు శ్రీదేవి వర్ధంతి సందర్భంగా భర్త బోనీకపూర్ తనతో ఉన్న చివరి చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిత్రంలో శ్రీదేవి, బోనీ కపూర్, చిన్న కుమార్తె ఖిషి, శ్రీదేవి పిన్ని కూతురు మహేశ్వరి ఉన్నారు. బోనీ కపూర్ కొన్ని రోజుల క్రితం తన భార్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన భార్య ఫోటోను షేర్ చేస్తూ.. మీరు 5 సంవత్సరాల క్రితం మమ్మల్ని విడిచిపెట్టారు. మీరు పంచిన ప్రేమ, మీతో గడిపిన అపురూప క్షణాలు మా మదిలో పదిలంగా ఉన్నాయి. మీరు మాతోనే ఎప్పటికీ ఉన్నాయి. మీ జ్ఞాపకాలు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి అని తన భావాలను పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో జో చలా గయా ముజే చోడ్కర్ వోహీ ఆజ్తక్ మేరే సాథ్ హై (నన్ను విడిచి వెళ్లాననుకుంటున్నావు.. కానీ నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు) అని రాసుకొచ్చారు.

రెండు రోజుల క్రితం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా తన తల్లితో మాట్లాడుతున్న పాత చిత్రాన్ని పంచుకుంటూ తన జ్ఞాపకాలను నెమరువేసుకుంది. అమ్మా.. నేను ఇప్పటికీ మీ కోసం ప్రతిచోటా వెతుకుతున్నాను. నీ కూతురిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ప్రతి పని మీతోనే మొదలవుతుంది అని రాసుకొచ్చింది.

శ్రీదేవి తన సినీ కెరీర్‌లో మొత్తం 300 చిత్రాలకు పైగా పనిచేశారు. మేనల్లుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ ఫ్యామిలీతో కలిసి వెళ్లింది. అక్కడ తాను బస చేసిన హోటల్‌లో బాత్ టబ్‌లో మునిగి ఫిబ్రవరి 24, 2018 న మరణించింది. కానీ శ్రీదేవి అభిమానుల్లో ఆమె మరణం ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story