Kevin : నయనతారతో కుర్ర హీరో జాక్ పాట్

నయనతార కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్. లేడీ ఓరియంటెడ్ స్టోరీస్ తో తనే మెయిల్ లీడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేయడంలోనూ తను ముందుంది. అందుకే అక్కడ తనను లేడీ సూపర్ స్టార్ అన్నారు. ప్రస్తుతం సౌత్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే బ్యూటీగా ఉన్న నయన్ అప్పుడప్పుడూ హీరోయిన్ గానూ నటిస్తోంది. అయితే కథలో తనకు గట్టి ప్రాధాన్యం ఉంటే తప్ప మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం లేదు. అయితే నయన్ ఉంటే సినిమాలకు బాగా కలిసొస్తుందని సీనియర్ హీరోలు కూడా భావిస్తుంటారు. అయినా తను స్టోరీకే నా ఓటు అంటుంది. అలాంటి బ్యూటీ సరసన నటించే ఛాన్స్ కొట్టేశాడో యంగ్ హీరో.
ఈ మధ్య కాలంలో ప్రామిసింగ్ స్టోరీస్ తో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో కెవిన్. లాస్ట్ ఇయర్ వచ్చిన డాడా అనే మూవీతో అందరి హృదయాలను కొల్లగొట్టాడు కెవిన్. ఈ యేడాది స్టార్ అనే సినిమాతో యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోన్న కెవిన్ హీరోగా నయనతార ఫీమేల్ లీడ్ లో ఓ సినిమా స్టార్ట్ కాబోతోంది. 7 స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. విష్ణు యడవాన్ అనే యంగ్ డైరెక్టర్ రూపొందించబోతున్నాడీ మూవీని. ఇంకా పూర్తి వివరాలు త్వరలోనే చెబుతారట. ఓ రకంగా ఇది కెవిన్ కెరీర్ కు పెద్ద ప్లస్ కాబోతోంది అనుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com