Ram Pothineni: యాక్షన్ డైరెక్టర్‌తో చాక్లెట్ బాయ్.. క్రేజీ కాంబినేషన్ ఫిక్స్..

Ram Pothineni (tv5news.in)
X

Ram Pothineni (tv5news.in)

Ram Pothineni: రామ్.. చాలావరకు ప్రేమకథల్లోనే నటించాడు. తాను యాక్ట్ చేసిన కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ.

Ram Pothineni: టాలీవుడ్‌లో చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని. ఈ హీరో ఇప్పుడిప్పుడే చాక్లెట్ బాయ్ ట్యాగ్‌ను వదిలేసి తనలోని మాస్ యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే కమర్షియల్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి మొగ్గుచూపుతున్నాడు. తాజాగా టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్.

రామ్.. చాలావరకు ప్రేమకథల్లోనే నటించాడు. తాను యాక్ట్ చేసిన కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ. కానీ 'ఇస్మార్ట్ శంకర్'తో రామ్ ఫేటే మారిపోయింది. అప్పటివరకు వరుస ఫ్లాపులు ఎదుర్కోవడంతో యాక్షన్ సినిమాతో లక్ పరీక్షించుకుందామనుకున్నాడు రామ్. కానీ అనూహ్యంగా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. అందుకే ఇక వరుసగా అదే తోవలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత 'రెడ్' అనే చిత్రంలో నటించాడు రామ్. అది రీమేక్ సినిమానే అయినా.. అందులో కూడా తనలోని మాస్ యాంగిల్‌తో ఇంప్రెస్ చేశాడు. ఇప్పుడు ఏకంగా యాక్షన్ డైరెక్టర్‌తోనే చేతులు కలపనున్నాడు. టాలీవుడ్‌లో యాక్షన్ డైరెక్టర్ ఎవరు అనగానే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. ఇక రామ్ తన కెరీర్‌లో 20వ చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో చేయనున్నట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

Tags

Next Story