Boyapati Srinu : అఖండ సక్సెస్ .. హాట్ టాపిక్‌‌గా బోయపాటి రెమ్యునరేషన్

Boyapati Srinu : అఖండ సక్సెస్ .. హాట్ టాపిక్‌‌గా బోయపాటి రెమ్యునరేషన్
Boyapati Srinu : అఖండ చిత్రంతో సూపర్ సక్సెస్ కొట్టాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. బాలకృష్ణ డ్యూయల్ రోల్‌‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.

Boyapati Srinu : అఖండ చిత్రంతో సూపర్ సక్సెస్ కొట్టాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. బాలకృష్ణ డ్యూయల్ రోల్‌‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. 50 రోజుల్లో రెండువందల కోట్లు కొల్లగొట్టింది. ఓటీటీలో కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది ఈ చిత్రం.. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని బోయపాటి ఇప్పటికే ప్రకటించాడు.

అయితే బాలయ్య మిగతా సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సీక్వెల్‌‌కి కాస్త టైం పట్టేలా ఉంది. ఈ క్రమంలో యంగ్ హీరో రామ్‌‌తో ఓ సినిమాని చేసేందుకు రెడీ అయ్యాడు బోయపాటి.. ఇప్పటికే కథాచర్చలు కంప్లీట్ అవ్వగా, నటీనటులు ఎంపీక నడుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఈ సినిమాకి హీరో రామ్ రెమ్యునరేషన్ కంటే బోయపాటి రెమ్యునరేషనే ఎక్కువట.. అవును.. హీరో రామ్ ఈ సినిమా కోసం తొమ్మిది కోట్లు తీసుకుంటున్నాడని, బోయపాటి ఏకంగా 12 కోట్లు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని కూడా ద్వారక క్రియేషన్స్ పతాకం పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారట. అఫిషియల్ అనౌన్స్‌‌మెంట్ త్వరలోనే వెలువడనుంది.

కాగా అటు రామ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్‌లో వారియర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్, బోయపాటి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Tags

Read MoreRead Less
Next Story