RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ను బ్యాన్ చేయండి.. అక్కడి అభిమానులు డిమాండ్.. ట్విట్టర్‌‌లో ట్రెండింగ్

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ను బ్యాన్ చేయండి.. అక్కడి అభిమానులు డిమాండ్.. ట్విట్టర్‌‌లో ట్రెండింగ్
Rajamouli RRR: రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి తీశారు.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

Rajamouli RRR:రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి తీశారు.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.. మరి మా భాషలో ఎందుకు రిలీజ్ చేయరని కన్నడిగులు ఆర్ఆర్ఆర్ టీమ్ ని ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాని మా కన్నడ భాషలో విడుదల చేస్తేనే చూస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అప్పటి వరకు కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయడానికి వీల్లేదని విరుచుకుపడుతున్నారు. కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ బ్యాన్ అన్న హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.

రాజమౌళి సినిమాను కన్నడలో విడుదల చేయడం లేదని నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు. RRR 1920 లలో జరిగిన అంశాన్ని తీసుకున్నారు. ఇది బ్రిటీష్ మరియు హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత కథ. ఈ చిత్రంలో ప్రధాన నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ కీలక పాత్రలలో కనిపించనుండగా, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.

RRR విడుదలకు ముందు, "#BoycottRRRinKarnataka" బుధవారం ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలలో RRR ఒకటి. ఈ చిత్రం ఈ వారం మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఆర్‌ఆర్‌ఆర్ విడుదల కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, కర్ణాటకలోని అభిమానులు మాత్రం నిరాశకు గురయ్యారు. ఈ సినిమా కన్నడలో విడుదల కాకపోవడంపై అభిమానులు ట్విటర్ వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

"#BoycottRRRinKarnataka @ssrajamouli ఇది కన్నడిగులకు జరిగిన ఘోర అవమానం అని ఒకరు ట్వీట్ చేయగా, సినిమాని మా భాషలోనే చూడాలనుకుంటున్నామని మరొకరు స్పష్టం చేశారు. "#BoycottRRRinKarnataka #WewantRRRinKannada అని ట్వీట్ చేస్తున్నారు.


Tags

Next Story