Brahma Anandam : ఓటిటిలోకి బ్రహ్మ ఆనందం

Brahma Anandam :  ఓటిటిలోకి బ్రహ్మ ఆనందం
X

బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా బ్రహ్మ ఆనందం. ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. చాలా అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి రిజెక్షన్ వచ్చిందనే చెప్పాలి. బ్రహ్మానందం తన కొడుకుకి తాతగా నటించాడు అన్న క్రేజ్ కనిపించినా ఆ క్రేజ్ కు తగ్గ కథనం లేక సినిమా నీరసంగా మారింది. దీనికి తోడు చాలా ఇమెచ్యూర్ రైటింగ్ కూడా సినిమాకు నెగెటివ్ టాక్ తెచ్చింది. ఓ రకంగా ఈ చిత్రంలో చాలా ప్లస్ అవుతాడు అనుకున్న బ్రహ్మానందమే మైనస్ అయ్యాడు. ఒక వయసు దాటిన తర్వాత వృద్ధులకూ ఓ తోడు కావాలని చెప్పిన ఈ చిత్రం ఆ పాయింట్ ను అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో ఫెయిల్ అయింది. బట్ కొన్ని చోట్ల వెన్నెల కిశోర్ ద్వారా మంచి హ్యూమర్ కనిపిస్తుంది. మరీ బోరింగ్ మూవీ కాదు కానీ.. మెయిన్ థీమ్ గాడి తప్పడం వల్లే రిజల్ట్ తేడా కొట్టిందనే రివ్యూస్ వచ్చాయి.

ఇక ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో రాబోతోంది. తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ చిత్రం ఈ 14 నుంచి స్ట్రీమ్ కాబోతోంది.అంటే రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటిటిలోకి వస్తోందన్నమాట. మామూలుగా ఈ తరహా సినిమాలకు ఓటిటి నుంచి మంచి అప్లాజ్ వస్తుంది. మరి బ్రహ్మ ఆనందం కూడా ఆ తరహా ప్రశంసలు అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Tags

Next Story