BrahmaAnandam : బ్రహ్మ ఆనందం ట్రైలర్ ఎలా ఉంది

బ్రహ్మానందం తాతగా ఆయన సొంత కొడుకు హీరోగా నటించిన సినిమా బ్రహ్మ ఆనందం. ముందు నుంచీ ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి, కొడుకులు తాత మనవళ్లుగా నటిస్తున్నారు అనే పాయింట్ ఆడియన్స్ అటెన్షన్ ను సంపాదించుకుంది. వెన్నెల కిశోర్ మరో కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని హిట్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న నక్కా రాహుల్ యాదవ్ నిర్మించాడు. ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్ట్ చేశాడు. ఈ 14న విడుదల కాబోతోన్న బ్రహ్మ ఆనందం ట్రైలర్ ను ప్రభాస్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే.. కంటెంట్ బేస్డ్ గా సాగే ఎంటర్టైనర్ అనిపిస్తుంది.
చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన ఓ కుర్రాడు తనకు తెలియకుండానే ఇంట్రావర్ట్ గా, స్వార్థపరుడుగా మారిపోతాడు.తను థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు ఓ పెద్ద అవకాశం వస్తుంది. అది పూర్తి చేస్తే తనను తాను ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ దానికి 6 లక్షలు అవసరం అవుతాయి. ఆ ఆరులక్షలు తను ఇస్తా అని అతని తాత తను పుట్టిన ఊరికి తీసుకువెళతాడు. అక్కడ తనకు ఆరెకరాల పొలం ఉందని చెప్పి ఆ ఊరికి తీసుకువెళ్లిన తాత ఈ కుర్రాడిని ఏం చేశాడు. ఏం నేర్పించాడు. ఆ ఊరి ప్రజలు ఈ కుర్రాడిని ఎలా ట్రీట్ చేశారు అనే కోణంలో సాగుతోంది ట్రైలర్.
హ్యూమన్ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో పాటు మానవ సంబంధాలను కలుపుకుని రాసుకున్న కథలా కనిపిస్తోంది. అందుకే వినోదంతో పాటు కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ఓరకంగా రొటీన్, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన ఎంటర్టైనర్ అనుకోవచ్చు. మరి ఈ చిత్రానికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com