Brahmanandam About Pushpa Item Song: ఎంత దుర్మార్గం.. సమంత నన్ను చూసి: బ్రహ్మీ కౌంటర్

Brahmanandam About Pushpa Item Song:ఆయన మొహం చూస్తేనే నవ్వొస్తుంది.. ఏ ఎక్స్‌ప్రెషనూ ఇవ్వక్కర్లేదు.. బ్రహ్మానందం ఉంటే సినిమా సగం హిట్ గ్యారెంటీ.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నే్ళ్లయినా ఆయన హావభావాలు నవ్వులు పూయిస్తూనే ఉన్నాయి. ఇక మీమ్స్ రాయుళ్లకు బ్రహ్మీ ఓ బెస్ట్ ఆప్షన్ అవుతున్నారు.. కాసేపు సరదాగా నవ్వుకోడానికి బావుంటాయి.. ఆయన కూడా వాటిని ఎంజాయ్ చేస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇప్పటి వరకు వచ్చిన మీమ్స్ అన్నీ ఓ ఎత్తైతే తాజాగా వచ్చిన మీమ్ చూసి దాని గురించి ఓ కార్యక్రమంలో బ్రహ్మానందం ప్రముఖంగా ప్రస్తావించారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. అయితే అందులో సమంత చేసిన ఐటెం సాంగ్ మరింత పాపులర్ అయింది.
ఇక ఈ పాటను చూసి పేరడీలు, ఎడిటింగ్ వెర్షన్లు రోజుకొకటి సోషల్ మీడియాలో హల్ చేస్తునే ఉన్నాయి. సాంగ్‌లో సమంత స్టిల్ ఒకటి ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది. మీమ్స్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే బ్రహ్మానందం.. ఓ సినిమాలో అదే స్టైల్‌లో ఉన్న ఫోటోని జత చేసి పోస్ట్ చేశారు మీమ్స్ చేయడంలో పండిపోయిన రూపకర్తలు.
అది చూసి ఆయన కూడా నవ్వుకుని ఉంటారు అది వేరే విషయం. అయితే అంతటితో ఊరుకోని మీమ్స్ రాయుళ్లు మా బ్రహ్మానందం స్టైల్‌ని కాపీ చేయకండి సామ్.. అని ఆ ఫన్నీ మీమ్ కింద పోస్ట్ పెట్టారు. అది కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
తాజాగా బ్రహ్మానందం దీనిపై స్పందించారు. ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన సదరు మీమ్ చూసి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఓ సినిమాలో అలా అన్నాను.. అది చూసి సమంత కాపీ కొట్టిందనడం ఎంత దుర్మార్గం అని సరదాగా కౌంటరిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com