సినిమా

Brahmastra: 'బాహుబలి'ని బీట్ చేయడానికి బాలీవుడ్ 'బ్రహ్మాస్త్ర'.. ఏకంగా మూడు భాగాల్లో..

Brahmastra: బాహుబలి సినిమా టాలీవుడ్‌ను కాదు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా స్థాయినే ఎవరూ అందుకోలేని చోట నిలబెట్టింది.

Brahmastra (tv5news.in)
X

Brahmastra (tv5news.in)

Brahmastra: బాహుబలి సినిమా టాలీవుడ్‌ను కాదు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా స్థాయినే ఎవరూ అందుకోలేని చోట నిలబెట్టింది. ఇప్పటివరకు బాహుబలి సాధించిన రికార్డులను ఇంకే ఇతర సినిమా సాధించలేకపోయింది. ఒక తెలుగు సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరడమే కష్టంగా ఉన్న రోజుల్లో 100 కోట్లకు పైగా బడ్జెట్‌ను పెట్టి రాజమౌళి చేసిన ఈ సాహసం ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేడు. అయితే బాహుబలి రికార్డులను బీట్ చేయడానికి బాలీవుడ్ సన్నాహాలు చేస్తోంది.

ఒక తెలుగు సినిమా ఉన్నట్టుండి అందుకోలేని శిఖరాలకు చేరినప్పటి నుండి ప్రతీ భాషలోని పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించి బాహుబలి రికార్డులను బీట్ చేయాలనుకుంటున్న వారే చాలామంది ఉన్నారు. అందులోనూ బాలీవుడ్ దీని గురించి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్'లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించి బాహుబలి రికార్డులను అందుకోవాలని చూసింది. కానీ కుదరలేదు. ఈసారి మరో వినూత్న ప్రయత్నంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.


'బ్రహ్మాస్త్ర'.. భారీ అంచనాల మధ్య, ఎక్కువ బడ్జెట్‌తో, సీనియర్ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2019లో సెట్స్‌పైకి వెళ్లింది. కానీ పలు కారణాల వల్ల ఇప్పటివరకు విడుదల కాలేకపోయింది. విడుదల విషయం పక్కన పెడితే బ్రహ్మాస్త్ర షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు.

అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణభీర్ కపూర్, ఆలియా భట్, మౌనీ రాయ్ లాంటి భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ముందుగా రెండు పార్టులలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం బ్రహ్మాస్త్రకు మూడు భాగాలు ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది. తాజాగా బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ నుండి మోషన్ పోస్టర్ విడుదల అయ్యింది. ఇందులో రణభీర్ కపూర్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES