Billa Ranga Baashaa : బీఆర్ బీ కాన్సెప్ట్ వీడియో.. నెక్ట్స్ లెవెల్

Billa Ranga Baashaa : బీఆర్ బీ కాన్సెప్ట్ వీడియో.. నెక్ట్స్ లెవెల్
X

ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై‘హనుమాన్’ సినిమా తీసి ఈ ఏడాది మంచి సక్సెస్ అందుకున్నారు నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య. లేటెస్ట్ గా మరో భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా.. కన్నడ క్రియేటివ్ డైరెక్టర్ అనూప్ భండారీ డైరెక్షన్ లో ఈ మూవీ రానుంది. సోమవారం సుదీప్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ ను మేకర్స్ రివీల్ చేశారు. ‘బిల్లా రంగా భాషా– ఫస్ట్ బ్లడ్(బీఆర్ బీ)’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాన్సెప్ట్ వీడియోను సైతం రిలీజ్ చేశారు. సుదీప్ ఫ్యాన్స్ ను ఈ వీడియో ఆకట్టుకుంటోంది. సుదీప్ – అనూప్ కాంబోలో 2022లో వచ్చిన ‘విక్రాంత్ రోణ’ బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. విక్రాంత్ రోణ స్క్రీన్ ప్లే మూవీ లవర్స్​ ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండటంతో భారీ హైప్ నెలకొంది.

Tags

Next Story