Shraddha Kapoor : ప్రియుడికి టాటా చెప్పేసిన శ్రద్ధాకపూర్...!

Shraddha Kapoor : ప్రియుడికి టాటా చెప్పేసిన శ్రద్ధాకపూర్...!
X
Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ తన ప్రియుడు రోహన్ శ్రేష్ఠతో విడిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ తన ప్రియుడు రోహన్ శ్రేష్ఠతో విడిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన రోహన్ శ్రేష్ఠతో గత నాలుగేళ్ళుగా డేటింగ్‌‌లో ఉన్న శ్రద్ధాకపూర్ ఇప్పుడు అతనికి బ్రేకప్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇటీవల గోవాలో జరిగిన శ్రద్ధా బర్త్ డే పార్టీలో రోహన్ ఎక్కడ కనిపించలేదు. దీనితో వీరిద్దరూ విడిపోయారన్న వార్తలకి బలం చేకూరుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్‌తో చివరిగా బాఘీ 3లో కనిపించిన శ్రద్ధాకపూర్... ప్రస్తుతం రణబీర్ కపూర్‌తో కలిసి ఓ సినిమా చేస్తోంది ఈ సినిమా 2023లో విడుదల కానుంది.

Tags

Next Story