Harsha Sai : బ్రేకింగ్ న్యూస్.. యూట్యూబర్ హర్ష సాయిపై కేస్

యూ ట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యాడు హర్ష సాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం.. సాయం కావాల్సిన వారికి తెలియకుండానే వెళ్లి వారికి అన్నీ సమకూర్చడం.. ఈ మొత్తాన్ని వీడియోస్ గా మలచి యూ ట్యూబ్ ద్వారా మరింత ఆదాయం పొందడం వంటివి చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. అతని చర్యలు చూసిన చాలామంది.. మాకూ సాయం చేయాలంటూ ఎన్నో రిక్వెస్ట్ లు పెట్టుకునేవారు. అయితే సడెన్ గా అతను యూ ట్యూబ్ లో కనిపించడం మానేశాడు. కారణమేంటో అందరికీ తెలుసు. ఈ పాపులారిటీని మరింత క్యాష్ చేసుకుంటూ తను హీరోగా మారాడు. ఫస్ట్ మూవీకే ఏకంగా ‘మెగా’ అనే టైటిల్ పెట్టుకుని మరీ మూవీ చేస్తున్నాడు. ఓపెనింగ్ రోజునే మూడు నిమిషాల వీడియో విడుదల చేశాడు.
కొన్ని రోజులుగా అతనిపై మరికొందరు విమర్శలు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించాడని... ఆ యాప్స్ కు ఆకర్షితులైన ఎంతోమంది బికారులుగా మారారని కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ టైమ్ లో అతనిపై ఓ అమ్మాయి కేస్ పెట్టడం సంచలనంగా మారింది.
ఇంతకు ముందు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఓ యువతి తాజాగా అతనిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేస్ పెట్టింది. పోలీస్ లు ఆమె స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. హర్ష సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, తన వద్ద రెండు కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించిందా యువతి. ప్రస్తుతం ఆ యువతి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు పోలీస్ లు. మరి ఈ కేస్ లో హర్ష సాయిని జానీ మాస్టర్ లా అరెస్ట్ చేస్తారా లేక విచారించి నిజా నిజాలు తెలిసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com