Shekhar Kammula : బ్రేకింగ్ న్యూస్.. శేఖర్ కమ్ములతో సమంత

Shekhar Kammula :  బ్రేకింగ్ న్యూస్.. శేఖర్ కమ్ములతో సమంత
X

కుబేరతో మంచి విజయాన్ని అందుకున్నాడు శేఖర్ కమ్ముల. తన జోన్ నుంచి బయటకు రాకుండానే స్టార్ హీరోతో హిట్ అందుకున్నాడు. సెకండ్ హాఫ్ కు సంబంధించి కొన్ని కామెంట్స్ వచ్చాయి. అయినా తెలుగు వరకూ కమర్షియల్ గా సేఫ్ అనిపించకుంది. కానీ ఇతర భాషల్లో మాత్రం ఫ్లాప్ గానే తేలింది. ఇక తన నెక్ట్స్ మూవీకి సంబంధించి ఓ లవ్ స్టోరీ తీస్తా అని గతంలో ఇంటర్వ్యూస్ లో చెప్పాడు శేఖర్. అది సమంతతో ఉండబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ స్టోరీతో ఈ చిత్రం ఉంటుందట. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. అలాగని ఇదేమీ సీరియస్ ఫిల్మ్ కాదట. ఓ బలమైన పాయింట్ ను ఎలివేట్ చేస్తూనే మంచి వినోదం కూడా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట శేఖర్.

ఈ తరహా పాత్రలు అంటే సమంత బాగానే సెట్ అవుతుంది. తనకు మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. నటనతోనూ బెస్ట్ అనిపించుకుంది. కాబట్టి అతను అనుకునే కథకు సమంత సెట్ కావొచ్చు. మరి ఆమె చేస్తుందా లేదా అనేది పాయింట్. అదే టైమ్ లో అసలు ఈ న్యూస్ లో నిజమెంత అనేది కూడా తేలాల్సిన విషయ.

గతంలో నయనతారతో ఓ రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు శేఖర్ కమ్ముల. మరి ఈ సారి మరో స్టార్ హీరోయిన్ తో లేడీ ఓరియంటెడ్ మూవీ అంటే ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Next Story