బ్రిగిడా సాగ.. కుర్రాళ్లకు సెగ

తమిళ్ యూట్యూబ్ వెబ్ సిరీస్ ‘ఆహా కల్యాణం’లో పవి టీచర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది బ్రిగిడా సాగ. సోషల్ మీడియాలో మస్తు క్రేజ్ తెచ్చుకుంది. చెన్నైలో పుట్టిన బ్రిగిడా సాగా లయోలా కాలేజీలో బీఎస్సీ చేసింది. 2019లో యూట్యూబ్ లో ‘ఆహా కల్యాణం’ వెబ్ సిరీస్ తో యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసింది. పవి టీచర్ క్యారెక్టర్ లో నటించి ఎంతోమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయోగ్య, వర్మ, మాస్టర్, వేలన్, ఇరవిన్ నిజల్ సినిమాల్లో నటించింది. గతేడాది శివబాలాజీ లీడ్ రోల్ లో వచ్చిన ‘సింధూరం’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది బ్రిగిడా. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ‘పెద్దకాపు పార్ట్1’లోనూ నటించింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే బ్రిగిడా.. ఫొటోషూట్స్ తో కుర్రకారుకు మత్తెక్కిస్తుంటుంది. తాజాగా ఆమె అప్ లోడ్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. బ్రిగిడా నటించిన లేటెస్ట్ మూవీ ‘కోజిపన్నై చెళ్లదురై’ ఈ నెల 20న రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com