Britney Spears Divorce : పెళ్లయిన 14 నెలలకే పెటాకులు

Britney Spears Divorce : పెళ్లయిన 14 నెలలకే పెటాకులు
X
విడాకులు తీసుకున్న బ్రిట్నీ స్పియర్స్, సామ్ అస్గారీ..!

పెళ్లయిన 14 నెలల తర్వాత అమెరికన్ గాయని బ్రిట్నీ స్పియర్స్, సామ్ అస్గారీ విడిపోయారు. అస్గారీ, బ్రిట్నీ స్పియర్స్‌తో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ జంట విడిపోయినట్లు పలు వర్గాలు ఆరోపించాయి. కాగా ఈ విషయంపై వారు గానూ, వారి సన్నిహితులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

దాదాపు ఐదు సంవత్సరాల డేటింగ్ తర్వాత స్పియర్స్, అస్గారీ సెప్టెంబర్ 2021లో నిశ్చితార్థం చేసుకున్నారు. మ్యూజిక్ వీడియో స్లంబర్ పార్టీ సెట్స్‌లో కలిసిన స్పియర్స్, సామ్.. జూన్ 2022లో వివాహం చేసుకున్నారు. లాస్ ఏంజిల్స్‌లోని పాప్ స్టార్ ఇంట్లో వారి వివాహాన్ని ఏర్పాటు చేశారు. వీరి వివాహానికి మడోన్నా, పారిస్ హిల్టన్, డ్రూ బారీమోర్, సెలీనా గోమెజ్‌లతో సహా 60 మంది అతిథులు హాజరయ్యారు. అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరి మధ్యా గొడవలు వస్తున్నాయని ప్రచారం మొదలైంది. వారు విడాకులు తీసుకోబోతున్నారని కూడా మార్చిలో పుకార్లు వినిపించాయి. అయితే అస్గారి ప్రతినిధి మాత్రం వాటన్నింటినీ ఖండించారు.

తమ పెళ్లికి చిహ్నంగా ఉండే ఉంగరాలు లేకుండా ఉన్న వీరి ఫొటోలపైనా కోహెన్ అస్గారి క్లారిటీ ఇచ్చారు. ఒక సినిమా కోసం చిత్రీకరిస్తున్నందున తీసివేసినట్లు చెప్పాడు. అక్టోబరు 24న విడుదల కానున్న స్పియర్స్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ది ఉమెన్ ఇన్ మీ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలా వారిద్దరూ విడిపోయారనే వార్తలు వచ్చాయి.


Tags

Next Story