Bro OTT Release : విడుదలైన నెలలోపే ఓటీటీలోకి.. ఎక్కడ, ఎప్పట్నుంచంటే...

Bro OTT Release : విడుదలైన నెలలోపే ఓటీటీలోకి.. ఎక్కడ, ఎప్పట్నుంచంటే...
ఓటీటీలోకి రాబోతున్న 'బ్రో'.. అధికారిక ప్రకటన చేసిన మేకర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన సినిమా 'బ్రో'. ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా.. పవర్ స్టార్ గెస్ట్ రోల్ లో అలరించాడు. దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం భారీ అంచనాల నడుమ ఇటీవలే విడుదలైంది. కానీ అనుకున్నంత రేంజ్ లో అలరించలేకపోయింది. దీంతో వసూళ్లు కూడా మామూలుగానే వసూలయ్యాయి. అయితే ఆల్రెడీ థియేటర్ రన్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

'బ్రో'.. ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ అయిన నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో నెట్ ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 25 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫామ్ చేసేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన హీరోను ఈసారి ఇంట్లో నుంచే చూసుకోబుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం ఇందులో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లోనూ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలో వచ్చేస్తుండడం గమనార్హం. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


Tags

Read MoreRead Less
Next Story