Buddy : బడ్డీ పోయాడు రావణ్ వస్తున్నాడు..

Buddy : బడ్డీ పోయాడు రావణ్ వస్తున్నాడు..
X
సరైన బజ్ లేదనే కారణంతో అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమాను జూలై 26 నుంచి ఆగస్ట్ 2కి పోస్ట్ పోన్ చేశారు. ఆ డేట్ లో ఇప్పుడు రావణ్ వస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరిది సరైన నిర్ణయం కాబోతోంది..

మంచి రిలీజ్ డేట్స్ ఉన్నా.. బజ్ లేదనే కారణంతో తప్పుకుంటున్నారు చిన్న సినిమాల వాళ్లు. నిజానికి కొన్నాళ్లుగా చిన్న సినిమాలు కూడా బాగా డజప్పాయింట్ చేస్తున్నాయి. ఈ టైమ్ లో ఉన్న డేట్స్ ను వాడుకోకుండా అంతా ఒకేసారి వచ్చినా వారికే ప్రాబ్లమ్ తప్పదు. అయినా అదే చేస్తున్నారు. తాజాగా తమ సినిమాకు ఆశించినంత బజ్ రాలేదనే కారణంతో ఈ నెల 26న విడుదల కావాల్సిన బడ్డీ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. అల్లు శిరీష్, అజ్మల్ అమర్, ప్రిషా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన బడ్డీ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ నిర్మించింది. శామ్ఆంటన్ డైరెక్ట్ చేశాడు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ మూవీని విడదల చేయబోతున్నాయి. అయితే బజ్ లేదనే కారణంతో ఇప్పుడీ చిత్రాన్ని ఆగస్ట్ 2కు పోస్ట్ పోన్ చేసుకున్నారు. మరి వారంలోనే ఎన్ని అద్భుతాలు చేసి ఎంత బజ్ తెచ్చుకుంటారో కానీ ఆగస్ట్ 2న వస్తున్నాం అని చెప్పిన రావణ్ మూవీ టీమ్ తమ సినిమాను ప్రీ పోన్ చేసి ఈ నెల 26న విడుదల చేస్తున్నారు.

ఈ నెల 26న తమిళ్ స్టార్ ధనుష్ నటించిన రాయన్ మూవీ మాత్రమే విడుదలవుతుంది. ఇది డబ్బింగ్ సినిమా. మరీ అన్ని థియేటర్స్ ను ఆక్యుపై చేసి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునేంత సీన్ ఈ మూవీకి లేదు. సో.. రావణ్ మూవీ టీమ్ ది సరైన నిర్ణయమే అనుకోవచ్చు.

పలాస సినిమాతో ఆకట్టుకున్న రక్షిత్ నటించిన సినిమా రావణ్. ఇదో సైకో థ్రిల్లర్. వెంకట్ సత్య డైరెక్ట్ చేశాడు.

నిజానికి ఆగస్ట్ 2నే చిన్న సినిమాల మధ్య చాలా పోటీ ఉంది. ఆ రోజు ఏకంగా ఐదు సినిమాలు విడుదల కానున్నాయి. వాటి నుంచి రావణ్ ముందుకు వచ్చింది కాబట్టి నాలుగు సినిమాలుంటాయి. మరి రావణ్ మూవీకి ఈ డేట్ ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.

Tags

Next Story