Sekhar Kammula : కుబేరకు బడ్జెట్ కష్టాలు

Sekhar Kammula :  కుబేరకు బడ్జెట్ కష్టాలు
X

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ‘కుబేర’. రీసెంట్ గా విడుదల చేసిన వీడియో గ్లింప్స్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. శేఖర్ కమ్ముల తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్టార్ హీరోలతో పనిచేస్తోన్న మూవీ ఇది. ఏసియన్ సినిమాస్ బ్యానర్ లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ చిత్రం చాలాకాలంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మామూలుగా శేఖర్ కమ్ముల రెగ్యులర్ డైరెక్టర్స్ లాగా పనిచేయడు. కాస్త బద్ధకంగానే సీన్లు చిత్రీకరిస్తాడని అందరికీ తెలుసు. ఇప్పటి వరకూ ఎక్కువగా కొత్తవాళ్లతోనే చేశాడు కాబట్టి సరిపోయింది. బట్ ఇప్పుడు స్టార్స్ ఉన్నారు కదా. ఆ కారణంగానో లేక బాగా ఆలస్యం అవడం వల్లో ఏమో కానీ.. కుబేర మూవీ బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా పెరిగిపోయిందట.

కుబేరను 80 కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలుపెట్టారట. ఇందులో మేజర్ గా రెమ్యూనరేషన్స్ ఉన్నాయి. దీనికి తోడు రకరకాల సెట్స్ కూడా ఉన్నాయి. ఈ కారణంగానే బడ్జెట్ అంచనాలను దాటేసిందంటున్నారు. ఇంకా చాలా వరకూ చిత్రీకరణ మిగిలి ఉన్న ఈ మూవీకి ఇప్పటికే 120 కోట్ల బడ్జెట్ అయిందట. ఇంత దాకా వచ్చాక వెనక్కి వెళ్లలేరు. కాబట్టి ఆ బడ్జెట్ భారాన్ని మోయడానికే నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉందనీ.. కాకపోతే శేఖర్ కమ్ములపై కాస్త గుర్రుగా ఉన్నారని టాక్. అఫ్ కోర్స్ ఈ ప్రాజెక్ట్ లో శేఖర్ కమ్ముల కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అయినా మేజర్ షేర్ ఏసియన్ దే కాబట్టి ఎక్కువ భారం వారిపైనే ఉంటుంది. అందుకే వాళ్లు శేఖర్ పై కాస్త కోపం ఉన్నారంటున్నారు. ఏదేమైనా ఇన్నాళ్ల పాటు స్టార్స్ ను మెయిన్టేన్ చేస్తూ షూటింగ్ చేయడం కూడా అంత సులువైన విషయం కాదు. అందుకే వీలైనంత త్వరగా ఈచిత్రాన్ని ముగించే ప్రయత్నాల్లో ఉన్నారట.

Tags

Next Story