Bullet Bandi Bride : 'బుల్లెట్టు బండి' వధువుకి మరో బంపరాఫర్..?

Bullet Bandi Bride : ఆ మధ్య తన పెళ్ళి బరాత్‌లో బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా అనే ఓ ప్రైవేటు సాంగ్‌కి నవవధువు సాయిశ్రీయ స్టెప్పులేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనితో ఆమెకి వీపరితమైన క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌తో ఆమె ఏకంగా సెలబ్రిటీగా మారిపోయింది.
దీనితో ఆమె ఏ పాటకైతే డ్యాన్స్ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ.. తాము నిర్మించబోయే తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించింది. త్వరలోనే సాయిశ్రీయ ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది. ఇదిలావుండగా ఆమెకి మరో బంపరాఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఓటీటీ వేదికగా మరో రెండు నెలల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభంకానుంది.
ఇందులో కంటెస్టెంట్స్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీగా మారిన సాయిశ్రీయను బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారని తెలుస్తోంది. బిగ్‌బాస్ లోకి వెళ్లేందుకు ఆమెకూడా ఒప్పుకున్నట్లు సమాచారం. దీనిపైన క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
కాగా ఈ ఓటీటీ బిగ్‌బాస్‌కి కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. . ఈ షోని యాంకర్ ఓంకార్ సంస్థ అయిన 'ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్'కి బాధ్యతలు తీసుకోనుందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com